అప్పన్నను దర్శించుకున్న జగన్ | Sakshi
Sakshi News home page

అప్పన్నను దర్శించుకున్న జగన్

Published Wed, Jan 28 2015 2:58 AM

అప్పన్నను దర్శించుకున్న జగన్ - Sakshi

సింహాచలం: వైఎస్సార్ సిపి అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ద ర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధ్వజస్తభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఆల యంలో ఉన్న కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా ప్రదక్షి ణ చేశారు. అంతరాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పేరిట అర్చకులు అష్టోత్తరం పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చనలు చేశారు. ఆలయ ఆస్థానమండపంలో నాలుగు వేదాలతో ఆశీర్వచనం అందజేశారు. స్వామి ప్రసాదాన్ని ఈవో అందజేశారు.

కచ్చితంగా భూములను క్రమబద్ధీకరించాలి

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను కచ్చితంగా క్రమబద్ధీకరించాలని, వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి క్రమబద్ధీకరించేవాళ్లమని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం మధ్యాహ్నం దర్శించుకునేందుకు వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నానన్నారు. దేవస్థానం భూములను కచ్చితంగా క్రమబద్ధీకరించాలన్నారు.

సింహాచలంలో ఘన స్వాగతం

సింహాచలం వచ్చిన జగన్‌కి ఘన స్వాగతం లభించింది. సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న అనంతరం రాజగోపురం దిగిన జగన్ వద్దకు పెద్ద ఎత్తున భక్తులు, అభిమానులు తరలివచ్చారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా జగనన్నా అంటూ కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కరచాలనం చేశారు. భక్తులు, అభిమానుల తాకిడితో జగన్ పావుగంటసేపు రాజగోపురం వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. గోశాల లేఅవుట్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, భీమిలి వైఎస్సార్ సిపి సమన్వయకర్త కర్రి సీతారాం ఇంటిని సందర్శించారు. ఈ సంధర్బంగా కర్రి సీతారాం సతీమణి కర్రి పైడిరాజు, కుటుంబసభ్యులు జగన్‌ని హారతులతో స్వాగతం పలికా రు. సీతారాం ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

Advertisement
Advertisement