ఉద్యోగుల రాసలీలలు.. సీసీ కెమెరాలో రికార్డు | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల రాసలీలలు.. సీసీ కెమెరాలో రికార్డు

Published Sun, Jul 5 2015 8:44 PM

two employees suspended in SV university

చిత్తూరు(తిరుపతి): ఎస్వీ యూనివర్సిటీలో ఓ ఉద్యోగి సహచర ఉద్యోగితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ శృంగార లీలలు కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పుటేజీలను పరిశీలించిన అధికారులు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జూన్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎస్వీయూ కోఆపరేటివ్ స్టోర్స్ ఇండియన్ గ్యాస్ కార్యాలయంలోని ఓ ఉద్యోగి, సహచర ఉద్యోగితో కార్యాలయంలోనే కొంత కాలంగా రాసలీలలు కొనసాగిస్తున్నాడు.

జూన్ 28న కార్యాలయంలోనే రాసలీలలు సాగిస్తుండగా అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఉద్యోగుల వ్యవహారంపై స్టోర్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కోఆపరేటివ్ స్టోర్స్ ఉపాధ్యక్షుడు జానకిరామయ్య, మిగిలిన ఆరుగురు డెరైక్టర్ల సమక్షంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. పుటేజీల్లో ఉన్నది స్టోర్స్ ఉద్యోగులేనని నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జానకిరామయ్య వారిద్దరినీ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మళ్లీ ప్రయత్నాలు : ఈ వ్యవహారంలో సస్పెన్షెన్‌కు గురైన క్లర్క్ విధుల్లో చేరడానికి అధికార పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాజకీయ ఒత్తిడితో ఆ క్లర్క్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement
Advertisement