ఎర్రచందనం ‘ఎ’ గ్రేడ్ టన్ను ధర 1.95 కోట్లు | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం ‘ఎ’ గ్రేడ్ టన్ను ధర 1.95 కోట్లు

Published Wed, Nov 26 2014 3:05 AM

Rs 1.95 crs to Red sandals auction for A grade

ఈ-వేలానికి భారీ స్పందన  తొలిరోజు పాల్గొన్నవారు 267మంది
 సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. 4,160 టన్నుల ఎర్రచందనం విక్రయించడానికి ప్రభుత్వం ఈ-వేలంలో భాగంగా తొలి రోజు సోమవారం 30 లాట్లకు వేలం నిర్వహించారు. టన్ను ఎర్రచందనం ఎ-గ్రేడ్‌కు గరిష్టంగా రూ. 1.95 కోట్లు, బి-గ్రేడ్‌కు గరిష్ట ధర రూ. 1.55 కోట్లు, కనిష్ట ధర రూ.56.65 లక్షల ధర పలికింది. సి-గ్రేడ్‌కు రూ. 16.51 లక్షల నుంచి రూ. 35.16 లక్షల వరకు ధరలు కోట్ చేశారు. తిరుపతి డిపోలో ఉన్న 30 లాట్లుగా విభజించిన 862 టన్నుల ఎర్రచందనం విక్రయానికి ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలం వివరాలను మంగళవారం అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఏవీ జోసెఫ్‌తో కలిసి పీకే ఝా వెల్లడించారు.

Advertisement
Advertisement