గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య

Published Fri, Oct 24 2014 9:18 AM

గుంటూరులో రౌడీ షీటర్ దారుణ హత్య - Sakshi

గుంటూరు :  గుంటూరులో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షలతో రమేష్ అనే రౌడీ షీటర్ను ప్రత్యర్థులు హతమార్చి, మృతదేహాన్ని బ్రాడీపేటలో రోడ్డు పక్కన పడవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రత్యర్థులే రమేష్ను హతమార్చి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

కాగా రమేష్ తనకు ప్రత్యర్థి శివయ్య గ్యాంగ్తో ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఆశ్రయించాడు. అప్పట్లో అతనిపై రెండుసార్లు హత్యాయత్నం కూడా జరిగింది.  ఈ నేపథ్యంలో శివయ్య గ్యాంగ్ కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు శివయ్య గ్యాంగ్ కూడా నగరంలో లేకపోవటం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూరుతోంది. కాగా మృతుని కుటుంబీలకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించే యత్నం చేస్తున్నారు.

Advertisement
Advertisement