కానిస్టేబుల్ గా నటించి కటకటాలపాలు | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ గా నటించి కటకటాలపాలు

Published Thu, Sep 3 2015 3:52 PM

Fake constable collects money from farmer

ఏలూరు (పశ్చిమగోదావరి) : ఓ వ్యకి నకిలీ కానిస్టేబుల్ అవతారమెత్తి ఓ పూజారి నుంచి డబ్బులు గుంజి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కొప్పాక గ్రామంలో నాగదాసు కొటేశ్వరరావు అనే వ్యక్తిని నకిలీ కానిస్టేబుల్ బెదిరించి రూ. 3,500లు వసూలు చేశాడు.

దీంతో సదరు నకలీ కానిస్టేబుల్, అతడికి తోడుగా వచ్చిన వ్యక్తులపై అనుమానం వచ్చిన బాధితుడు సీఐకు ఫోన్‌లో విషయం తెలిపారు. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement