సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్

Published Tue, May 7 2024 6:29 PM

Sonia Gandhi Releases an Emotional Video For Voters

ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.

మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.

ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.

మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్  కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్‌ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement