తెరపినివ్వని ‘హార్వీ’ | Sakshi
Sakshi News home page

తెరపినివ్వని ‘హార్వీ’

Published Thu, Aug 31 2017 3:36 PM

గత ఐదురోజులుగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపాను హార్వీ మరింత విధ్వంసకరంగా మారుతోంది. బుధవారం నాటికి తుపాను సంబంధిత కారణాలతో మరణించిన వారి సంఖ్య 30కి చేరింది. వారిలో ఓ భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. గురువారానికల్లా 150 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. వరదలు తగ్గితే ఇంకా భారీ సంఖ్యలో మృతదేహాలు, మృతుల వివరాలు లభించే అవకాశం ఉందన్నారు. వరదలను అవకాశంగా తీసుకుని జరిగే దొంగతనాలు, నేరాలను నివారించేందుకు హూస్టన్‌ నగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వేలాది సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హూస్టన్, సమీప ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు వరదలో చిక్కుకున్న 13 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement