హరిత హారం..మహా యజ్ఞం | Sakshi
Sakshi News home page

హరిత హారం..మహా యజ్ఞం

Published Fri, Jul 3 2015 7:26 AM

‘హరితహారం’ శ్రీకారానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 10 వరకు జిల్లాలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారం రోజుల్లో 3.10 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో అధికారయంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థలు మమేకమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 41 మండలాల్లోని 243 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. మొక్కలు నాటడంలో అటవీ శాఖతోపాటు ఐటీడీఏ ఇతర ప్రభుత్వ శాఖలు పాలుపంచుకుంటున్నారుు.