బినామీ ఆస్తులపై కేంద్రం తాజా నిర్ణయం ! | Sakshi
Sakshi News home page

బినామీ ఆస్తులపై కేంద్రం తాజా నిర్ణయం !

Published Tue, Dec 27 2016 7:10 AM

నల్లధనానికి చెక్‌ పెట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక బినామీ ఆస్తులపై దృష్టి సారిస్తోంది. ఆ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అడుగు ముందుకేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు... లెక్క చెప్పలేని ఆస్తులుంటే జప్తు చేసే చట్టానికి పదును పెడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును వేగవంతం చేసింది. 1988 నుంచే బినామీ లావాదేవీల నిషేధిత చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కొన్ని లొసుగులను సవరిస్తూ ఈ ఏడాది ఆగస్టులోనే కేంద్రం... బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం–2016 అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే ఈ చట్టానికి మెరుగులు దిద్దింది