ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్‌, కుంబ్లే | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్‌, కుంబ్లే

Published Fri, Apr 26 2024 1:22 PM

Team India Head Coach Rahul Dravid Cast His Vote In General Elections 2024

దేశంలో ఇవాళ (ఏప్రిల్‌ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్‌ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్‌ 7, అస్సాం 5, బీహార్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 3, చత్తీస్‌ఘడ్‌ 3, జమ్మూ కశ్మీర్‌ 1, మణిపూర్‌ 1, త్రిపురలో ఒక లోక్‌సభ​ స్థానానికి ఇవాళ పోలింగ్‌ జరుగతుంది. 

 

 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్‌, ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్‌ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు.

 

 

ఓటు వేసిన అనంతరం ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్‌ తెలిపాడు. ద్రవిడ్‌ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. 
 

Advertisement
Advertisement