రీల్స్‌ రాజా.. గురజాల | Sakshi
Sakshi News home page

రీల్స్‌ రాజా.. గురజాల

Published Thu, Apr 25 2024 4:14 PM

Ticket for Gurjala Jaganmohan Naidu from Bengaluru who sees money - Sakshi

విలాసవంత జీవనశైలిలో  గురజాల జగన్‌మోహన్‌ నాయుడు 


ప్రజల కష్టం తెలియని వ్యక్తికి టీడీపీ టికెట్‌ 


రికార్డింగ్‌ డ్యాన్సులు.. బైకుపై స్టంట్లు.. తుపాకులతో వీడియోలు 


ఇప్పటి వరకు చిత్తూరు వాసులకు చేసిందేమీలేదు! 


ఓడిపోతే మళ్లీ బెంగళూరుకే మకాం..!   

ప్రజల కష్టం తెలిసిన వారు.. పేదల స్వేదం విలువ తెలిసిన వారు.. జవాబుదారీతనంలో బాధ్యతలు నిర్వర్తించేవారు తమ ప్రతినిధిగా చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.. అయితే డబ్బుంటే చాలు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి మరే అర్హత అవసరం లేదని చంద్రబాబు మరోమారు నిరూపించారు. పార్టీ కోసం త్యాగాలను చేసిన వారు.. ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడిన వాళ్లు.. ఏళ్ల తరబడి జెండాలు మోసిన నేతలను గాలికి వదిలేశారు. రూ.కోట్లకు పడగలెత్తడమే ప్రధాన అర్హతగా భావించి.. బెంగళూరు నుంచి ఊడిపడిన గురజాల జగన్‌మోహన్‌నాయుడుని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు కనీస పరిచయం లేని వ్యక్తిని స్థానిక నేతల నెత్తినపెట్టారు. తీరా ఆయన వ్యవహారశైలి చూస్తే విలువలకు తిలోదకాలిచ్చినట్టే కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న సదరు అభ్యర్థి వీడియోలు.. రీల్స్‌ చూసిన టీడీపీ నేతలు సైతం ఇదెక్కడి విపరీతం అంటూ తలలు పట్టుకుంటున్నారు. 

చిత్తూరు అర్బన్‌ : టీడీపీ చిత్తూరు ఎమ్మెల్య అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌నాయుడు (జీజేఎం) ప్రచారానికి వెళితే రూ.కోట్ల విలువ చేసే వాహనాల శ్రేణి, ఖరీదైన వ్యక్తులు తప్ప సామాన్యులు కనిపించరు. జీజేఎం రోజుకు పట్టుమని అయిదు కిలో మీటర్లు కూడా నడిచి తిరగలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన జీవన శైలి మొత్తం విలాసవంతంగా కనినపిస్తుంది. కష్టపడి పనిచేసే పేదల బతుకు పోరాటంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. అలాంటిది చిత్తూరు నియోజకవర్గంలో ప్రజల మనన్నలు పొందడం జీజేఎంకు చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా సొంత పార్టీలోని సీనియర్లకు సైతం ఆయన వ్యవహారశైలి నచ్చడంలేదనే విమర్శలున్నాయి. ఇటీవల పార్టీలోకి వచ్చిన ఓ సీనియర్‌ నాయకుడి అనుచరులు తన ప్రత్యర్థతో మాట్లాడుతున్నారా...? అని ఆరా తీయడం వాళ్లకు తెలిసి పోయి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. 

పారీ్టలో కురువృద్ధుడిగా ఉన్న వ్యక్తిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని, అందుకే తన ప్రణాళికలు తనకు ఉన్నట్లు సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఇక టికెట్‌ రాకపోవడంతో నిస్తేజంలో ఉన్న టీడీపీలోని కాపు నాయకులను అస్సలు నమ్మడంలేదని, వీళ్ల వల్ల తనకు వంద ఓట్లు కూడా పడవని జీజేఎం ఓ యువ నేత వద్ద అన్నట్లు తెలుస్తోంది. తాను కేవలం క్షేత్రస్థాయిలో ఓటర్లను నమ్ముతానే తప్ప, వెన్నంటే ఉంటూ తనపై బురదజల్లేవారిని నమ్మడంలేదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. 20 ఏళ్లల్లో ఎపుడూ చిత్తూరులో కనిపించని వ్యక్తి, రేపు ఎన్నికల్లో ఓడిపోతే, బెంగళూరుకు వెళ్లిపోకుండా స్థానికంగా అందుబాటులో ఉంటారని ఎలా నమ్మగలమని సామాన్య కార్యకర్తలు అనుమానిస్తున్నారు. 

అడ్డదిడ్డంగా వీడియోలు..! 
సామాజిక మాధ్యమాల్లో జీజేఎం చేసిన రీల్స్, వీడియోలను చూస్తుంటే కొందరు నవ్వుకుంటుంటే, మరికొందరు అసహ్యించుకుంటున్నారు. ఇటీవల వైరల్‌గా మారిన ఆయన వీడియోలు చూసిన ప్రజలు ఇదెక్కడి వేషాలు బాబోయ్‌ అని మండిపడుతున్నారు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..  

► బైకు నడిపేటపుడు హెల్మెట్‌ పెట్టుకుంటే ప్రమాదం జరిగినా ప్రాణహాని ఉండదు. పైగా వేగంగా బైకును పోనిచ్చి, రెండు చేతులు వదిలేస్తూ స్టంట్లు చేస్తే..? కచ్చితంగా హెల్మెట్‌ పెట్టుకోవాలి. పైగా ప్రభుత్వ రహదారులపై ఇలాంటివి చేసేపుడు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నది నిబంధన. కానీ చిత్తూరు టీడీపీ అభ్యర్థి ఈ నిబంధనలను తుంగలో తొక్కి బైకు వేగంగా నడుపుతూ, రెండు చేతులు వదిలేసి స్టంట్లు చేసే వీడియోలను సోషల్‌ మీడియాలో విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. 

► మరొక వీడియోలో మహిళలతో కలిసి జీజేఎం రికార్డింగ్‌ డ్యాన్సులు చేస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తూ యువతకు ఏం సందేశమిస్తున్నారని చిత్తూరు వాసులు ప్రశి్నస్తున్నారు. 

► ఇంకొక వీడియోలో తనకు అంగరక్షులు ఉన్నారనే  అర్థం వచ్చేలా ఇద్దరు వ్యక్తులకు పొడవాటి తుపాకులు ఇచ్చి వాటిని కూడా వీడియో తీసి పెట్టాడు. ఈ వీడియో ఎక్కడ తీశారో..? అసలు అందులో కనిపిస్తున్న అంగరక్షకుల వద్ద ఉన్న తుపాకులకు లైసెన్స్‌ ఉందా.? కాల పరిమితి అయిపోయిందా..? అనే వివరాలు తెలియడంలేదు. దీని ద్వారా తానో డాన్‌గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

► ఇటీవల చిత్తూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావుతో కలిసి ప్రచారానికి జీజేఎం వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో మాట్లాడారు.  తాను ఎక్కడికి వెళ్లినా నీళ్లు లేవు, రోడ్లులేవు అంటున్నారని, ఇక్కడ నేను కాదు కదా ఉండేది.. ఇచ్చేది అని దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో చిత్తూరు వాసులు ఈయనకు ఓటేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

Advertisement
Advertisement