Sakshi News home page

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన సోనియా గాంధీ.. 'ఆ క్రెడిట్ మాదే'

Published Tue, Sep 19 2023 11:39 AM

Congress Leader Sonia Gandhi Reacts On Women Reservation Bill - Sakshi

న్యూఢిల్లీ: తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కేంద్ర కేబినెట్ సమావేశమై చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లు ఏ క్షణాన్నైనా ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత సోనియా గాంధీని ప్రశ్నించగా 'ఈ బిల్లు మాదే'నని సమాధానమిచ్చారు. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రెండోరోజు కొత్త పార్లమెంట్ భవనంలో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయాన్నే పాత పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్ కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన ఎంపీలు  ఇవాళ  ఉదయమే  పార్లమెంట్  భవనం వద్దకు  చేరుకున్నారు.  

ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా  రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ భాగస్వామ్య పార్టీలకే దక్కుతుందని అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం. 

ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు ఎంపీ రేవణ్ణకు ఉపశమనం

Advertisement

What’s your opinion

Advertisement