తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక | Sakshi
Sakshi News home page

తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక

Published Fri, Dec 1 2023 10:17 AM

Cyclonic Storm Likely In Tamil Nadu Coast In 3 days - Sakshi

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. డిసెంబర్ 1 నుంచి 4 మధ్య తమిళనాడు తీరప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. చెన్నైతోపాటు తమిళనాడులోని మరో ఐదు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం వర్ష ప్రభావిత జోన్‌లో ఉన్నట్లు పేర్కొంది. 

గత కొద్ది రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గురువారం కూడా చెన్నై చుట్టుపక్కల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర సేవల కోసం చెన్నై కార్పొరేషన్ ఎమర్జెన్సీ నెంబర్ 1913 నెంబర్‌కు సమాచారం అందించాలి కోరారు. ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పర్చుకోవాలని కోరారు. 

ఇదీ చదవండి: AIIMS Rishikesh: ఎయిమ్స్‌ నుంచి కార్మికులు డిశార్జ్‌

Advertisement
Advertisement