This Friday OTT Movie Releases: ఓటీటీల్లో ఒకేరోజు 18 మూవీస్ రిలీజ్.. అవి మాత్రం స్పెషల్
Published
Wed, Nov 8 2023 11:10 PM
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దీపావళి స్పెషల్ కానుకగా 'జపాన్', 'జిగర్ తాండ', 'టైగర్ 3' లాంటి డబ్బింగ్ మూవీస్ మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కావడం లేదు. దీంతో ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం బోలెడన్ని కొత్తకొత్త సినిమాలు-సిరీసులు రెడీ అయిపోయాయి.
ఈ సోమవారం ఓటీటీ మూవీస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పటికీ 20కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతుండగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. అలా ఈ శుక్రవారమే దాదాపు 18 మూవీస్-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూరు స్క్వాడ్, ఘూమర్, ద బాయ్స్ హాస్టల్ సినిమాలతో పాటు లేబుల్ అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ ఏంటి?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (నవంబరు 10)
నెట్‌ఫ్లిక్స్
ఎట్ ద మూమెంట్ - మాండరిన్ సిరీస్
ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ - స్పానిష్ సిరీస్
ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా
అకుమా కున్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
007: రోడ్ టూ ఏ మిలియన్ - ఇంగ్లీష్ సిరీస్
దిన్ హసీమ్ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో
పిప్పా - హిందీ చిత్రం
పులిక్కుత్తు పండి - తమిళ మూవీ
హ్యాక్ క్రైమ్స్ ఆన్లైన్ - హిందీ సిరీస్
క్రష్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్ (నవంబరు 11)
BTS ఎట్ టూ కమ్ - కొరియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)