భార్య చెక్కులతో తమాషాలా? | Sakshi
Sakshi News home page

భార్య చెక్కులతో తమాషాలా?

Published Sun, Sep 10 2023 2:06 AM

- - Sakshi

కర్ణాటక: భార్యకు చెప్పకుండా బ్లాంక్‌ చెక్కు ఉపయోగించి రుణం పొందడం ఆమెను మానసిక ంగా హింసించడంతో సమానమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం ఆధారంగా దంపతుల కు కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను ఎత్తి చూపింది. గతంలో కుటుంబ న్యాయస్థానం భార్య పిటిషన్‌ మీద విడాకులు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ మండ్య జిల్లా హొనగానహళ్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.

విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌కుమార్‌ ఏ.పాటిల్‌ ధర్మాసనం ఈ కేసును విచారించింది, భార్యను ఆమె భర్త బలిచ్చే గొర్రెగా చేశారని అభిప్రాయపడింది. అతని పిటిషన్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. భార్యను భర్త మానసిక హింసకు గురిచేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. భార్యకు చెందిన చెక్కులను దుర్వినియోగం చేయడంపై పిటిషనర్‌ స్పందించడం లేదు. ఇదంతా కూడా భార్యను ఇబ్బంది పెట్టడం అని అర్థమవుతుంది. ఆ చెక్కుల ద్వారా అప్పులు చేయడం క్రిమినల్‌ కేసులతో కూడిన బెదిరింపులను మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది.

అంతేకాకుండా భర్త నడవడికతో భార్య అవమానం, మానసిక హింసను అనుభవించారు. ఈ అంశాన్ని కుటుంబ న్యాయస్థానం కూలంకుషంగా పరిశీలించి తీర్పును ప్రకటించిందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం అన్ని ఆధారాలను పరిశీలించి న్యాయసమ్మతమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి లోపదోషాలు కనిపించలేదని న్యాయస్థానం తెలియజేసి, పిటిషన్‌ సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది.

Advertisement
Advertisement