ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అలా అస్సలు చేయకండి | Sakshi
Sakshi News home page

Kitchen Tips: ఉల్లిపాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే? ప్లాస్టిక్‌ కవర్స్‌లో,..

Published Wed, Sep 6 2023 9:51 AM

Kitchen Tips: How To Store Onions For Long Time - Sakshi

కిచెన్‌ టిప్స్‌: వర్షాకాలంలో ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఉల్లి ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. 

► ఇతర కూరగాయలు ఉన్న బుట్టలో ఉల్లిపాయలను ఉంచకూడదు. దుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వంటి వాటితో కలిపి ఉల్లిపాయలు ఉంచడం వల్ల త్వరగా మొలకలు వస్తాయి. కూరగాయల్లో ఇథలిన్‌ ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తడానికి దోహదపడుతుంది.

ఉల్లిపాయలను నిల్వచేసేందుకు పేపర్‌ బ్యాగ్‌లనే వాడాలి. పేపర్‌ బ్యాగ్స్‌లో ఉల్లిపాయలు ఉంచడం వల్ల ఉల్లిపాయల్లో ఉత్పన్నమయ్యే తేమను పేపర్‌ పీల్చుకుంటుంది. తేమ లేకపోతే ఉల్లిపాయలు త్వరగా మొలకెత్తవు.



రిఫ్రిజిరేటర్‌లో ఉల్లిపాయలను నిల్వచేయకూడదు. రిఫ్రిజిరేటర్‌లోని ఇతర కూరగాయల వల్ల, లోపలి తేమ వాతావరణం ఉల్లి త్వరగా మొలకెత్తేలా చేస్తాయి.

ప్లాస్టిక్‌ సంచుల్లో ఉల్లిపాయలను ఎప్పుడూ నిల్వ చేయకూడదు. మార్కెట్‌ నుంచి తెచ్చిన ప్లాస్టిక్‌ సంచిలో నుంచి ఉల్లిపాయలు తీయడం మర్చిపోతుంటాము. ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేడికి ఉల్లిపాయలు పాడవుతాయి.

Advertisement
Advertisement