డైట్‌లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం! | Sakshi
Sakshi News home page

డైట్‌లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం!

Published Tue, Mar 26 2024 11:08 AM

Eating Korean Kimchi Can Give You Radiant and Glowing Skin - Sakshi

కొరియన్‌ గ్లాస్ స్కిన్‌లా చర్మం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అందుకోసం అని కొరియన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌లను ట్రై చేస్తుంటారు. వాటన్నింటి కంటే కూడా ఈ కొరియన్‌ వంటకాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే చక్కటి మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అకాల వృద్ధాప్యా ఛాయలను కూడా దూరం చేస్తుంది. ఏంటా వంటకం అంటే..

కొరియన్‌ కిమ్చి అనే ప్రసిద్ధ వంటకం మీ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా చేయడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కిమ్చి అనేది సాంప్రదాయ కొరియన్‌ పులియబెట్టిన ఆహారం. దీన్ని కొరియన్లు ప్రతిరోజు తమ ఆహరంలో భాగం చేసుకుంటారు. ఇది సాధారణంగా చక్కెర, ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అ‍ల్లం, మిరపకాయ మసాల వంటి వాటిని జోడింది పులియబెట్టిన క్యాబేజీతో తయారు చేస్తారు. ఈ కిమ్చిని కావాలంటే ముల్లంగా, సెలెరీ, క్యారెట్‌, దోసకాయ, బచ్చలి కూర వంటి ఇతర కూరగాయలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు.

ఇది పులియబెట్టడం వల్ల ఉబ్బినట్లుగా ఉండి, పుల్లని రుచిని కలిగి ఉంటుంది. దీన్నీ మన రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటే కొరియన్లలాంటి గ్లాస్‌ స్కిన్‌ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మెటిమలు లేని, మృదువైన హైడ్రేటెడ్‌ చర్మాన్ని పొందొచ్చని చెబుతున్నారు కాస్మెటిక్‌ డెర్మటాలజిస్ట్‌ నీతి గౌర్‌. ఈ వంటకం చర్మాన్ని ఏవిధంగా మేలు చేస్తుందా సవివరంగా చూద్దాం.

ప్రోబయోటిక్స్: కిమ్చిలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఇందులో ఉండే గట్ మైక్రోబయోమ్ చర్మ సంరక్షణ తోపాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది​ . శరీరంలో ప్రోబయోటిక్స్ సమతుల్య గట్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. తద్వారా సంభావ్యంగా చర్మం మంటను తగ్గించి..మొటిమలు, తామర వంటి వాటిని రాకుండా చేస్తుంది

యాంటీఆక్సిడెంట్లు: కిమ్చిలో వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కీలకమైనవి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, పర్యావరణ ఒత్తిళ్లు, యూవీ రేడియేషన్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సీడెంట్లు ఒత్తిడిని తగ్గించి..ముఖాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తుంది. 

యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్: కిమ్చీని తయారీలో కిణ్వ ప్రక్రియ కారణంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, రోసేసియా, అకాల వృద్ధాప్యం వంటివి దూరం చేస్తుంది. అలాగే ఎక్కువగా చర్మ పరిస్థితులలో వచ్చే వాపు వంటివి రానియ్యదు. 

విటమిన్లు, మినరల్‌ కంటెంట్‌:
కిమ్చిలో  విటమిన్లు ఏ,సీ, కే వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే కాల్షియం, ఐరన్‌ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కొల్లాజెన్ సంశ్లేషణ, గాయం వంటి వాటి నుంచి సంరక్షిస్తుంది.

(చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్‌ని లాగించేస్తుందా..!)

Advertisement
Advertisement