Sakshi News home page

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Dec 3 2023 2:55 PM

Tiday Gold And Silver Price Details - Sakshi

గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ. 750 నుంచి రూ. 800 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5845, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6376గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 58450, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 63760గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధర రూ. 5915 (22 క్యారెట్స్), రూ. 6453 (24 క్యారెట్స్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 59150, రూ. 64530గా ఉంది. నిన్నటి ధరలే ఈ రోజు ఉండటం గమనార్హం. అంటే ఈ రోజు పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఇదీ చదవండి: చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో - ఫోటోలు వైరల్

ఢిల్లీలో ఈ రోజు పసిడి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రాము 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 5860, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజ్ రూ. 6391గా ఉంది. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 5860 (22 క్యారెట్స్), రూ. 63910 (24 క్యారెట్స్)గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement