Sakshi News home page

ఆ కొత్త టెక్నాలజీతో ట్రైన్ జర్నీ మరింత సేఫ్! ఎలా అనుకుంటున్నారా?

Published Sun, Sep 10 2023 7:32 PM

Northeast Frontier Railway Working On AI Technology - Sakshi

AI Technology: గత కొన్ని రోజులకు ముందు ట్రైన్ ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే అలాంటి ప్రమాదాలను తగ్గించడానికి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (Northeast Frontier Railway) ఒక కొత్త ప్రయోగానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ట్రైన్ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలలో ఒకటి కొన్ని సందర్భాల్లో డ్రైవర్లు నిద్రపోవడం కూడా. కావున అలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి రైల్వే 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI)ను ఉపయోగిస్తోంది. ఇది అమలులోకి వస్తే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నా లేదా కంటిరెప్పలు వాల్చుతున్నా.. డివైజ్ ముందే గుర్తిస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ బ్రేకులు కూడా వేస్తుంది.

కంటిరెప్పలు వాల్చుతున్న పరిస్థిని బట్టి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కొత్త టెక్నాలజీ కావాలని రైల్వే బోర్డు ఇప్పటికే 'ఎన్ఎఫ్ఆర్'ను కోరింది. ఈ కొత్త విధానానికి రైల్వే డ్రైవర్ అసిస్ట్ సిస్టం (RDAS) అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా రానున్న రోజుల్లో ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం.

ఈ కొత్త టెక్నాలజీపై 'ది ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్‌మెన్‌ ఆర్గనైజేషన్' (IRLRO) సుముఖత చూపకపోవడం గమనార్హం. ఇలాంటి టెక్నాలజీ అవసరం లేదని, ఇప్పటికే వేగంగా ప్రయాణించే రైళ్లలో డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి కావలసిన వ్యవస్థలు ఉన్నాయని వెల్లడించింది. 

ఇదీ చదవండి: వాడిన పూలతో కోట్ల బిజినెస్ - ఎలాగో తెలిస్తే షాకవుతారు!

ప్రతి హై-స్పీడ్ రైలు ఇంజన్ 60 సెకన్లకు ఒకసారి డ్రైవర్ కొట్టాల్సిన ఫుట్-ఆపరేటెడ్ లివర్ (పెడల్)తో వస్తుంది. ఒకవేళ డ్రైవర్ అలా చేయకాపోతే ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేక్‌లు పడతాయి, తద్వారా ట్రైన్ ఆగిపోతుంది. ఈ వ్యవస్థ సరిపోతుందని ఐఆర్ఎల్ఆర్ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ 'సంజయ్ పాంధి' (Sanjay Pandhi) అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement