Sakshi News home page

Devaragattu Bunny Utsavam 2023: దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?

Published Tue, Oct 24 2023 10:18 AM

Devaragattu Bunny Utsavam - Sakshi

సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా..
ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు.

ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు.

పూర్తి బందోబస్తు..
ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి  ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి  పోరాటాన్ని నిలపనున్నారు.

భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు.

Advertisement

What’s your opinion

Advertisement