-
'నా జూదం ఫలించలేదు'
సోచి: ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్నకలలు కల్లలు కావడంతో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తన ఆటపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'చాలా ఉద్వేగభరిత క్షణాలు అవి. 27వ ఎత్తును బీజీ7 వేస్తే పరిస్థితి సమంగా ఉండేది. అయితే నా జూదం ఫలించలేదు. అందుకు తగిన శిక్ష పడింది. ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమది. మొత్తంగా చూస్తే నల్ల పావులతో నేను బాగానే ఆడాను. అయితే మాగ్నస్ కార్ల్ సన్ మెరుగ్గా ఆడాడని అంగీకరించాలి' ఆనంద్ తెలిపాడు. అతను ఒత్తిడిని తనకంటే బాగా ఎదుర్కొన్నాడని,. అతనితో పోలిస్తే ఎక్కువ సార్లు తానే బలహీనంగా కనిపించానన్నాడు. ఈ ఓటమితో తాను చెస్ మానేయాలని అనుకోవడం లేదని ఆనంద్ తెలిపాడు. -
ఆనందం ఆవిరి
ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కలలు కల్లలయ్యాయి. ఏడాదిలోపు అదే ప్రత్యర్థి చేతిలో ఆనంద్‌కు మరో షాక్... పాయింట్లలో తేడా మినహా అదే ఫలితం పునరావృతం... మ్యాచ్‌ను ఆఖరి గేమ్ వరకు నడిపించాలంటే ఓడకుండా ఉండాల్సిన మ్యాచ్‌లో ఆనంద్ తప్పటడుగు వేశాడు. సాహసం చేయబోయి తాను వేసిన ఎత్తులో తానే చిక్కుకున్నాడు. ఫలితమే... మాగ్నస్ కార్ల్సన్ మోముపై మరోసారి చిరునవ్వు మెరిసింది. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చదరంగపు వేదికపై ‘కింగ్’ అనిపించుకున్నాడు. సోచి: విశ్వనాథన్ ఆనంద్-మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోరు ఒక గేమ్ ముందుగానే ముగిసింది. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో కార్ల్సన్ 45 ఎత్తులో ఆనంద్‌ను చిత్తు చేశాడు. ఫలితంగా 6.5-4.5 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. అయితే 27వ ఎత్తులో వేసిన ఎత్తు అతడిని విజయానికి దూరం చేసింది. ఈ పొరపాటును ఉపయోగించున్న మాగ్నస్, మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను విజయం వైపు తీసుకుపోయాడు. ఈ గేమ్ గెలిస్తే అవకాశాలు నిలిచి ఉంటాయని భావించిన ఆనంద్, అనవసరపు దూకుడు ప్రదర్శించాడు. ‘డ్రా’కు కూడా మంచి అవకాశం ఉన్న దశలో ధైర్యం చేసి భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అయితే అది పని చేయకపోగా, ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్సన్ 3 గేమ్‌లు, ఆనంద్ 1 గేమ్ గెలవగా, మిగతా 7 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఫలితం తేలిపోవడంతో మంగళవారం జరగాల్సిన 12వ గేమ్ ఇక నిర్వహించరు.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement