-
టీఆర్ఎస్ ‘తెలంగాణ రేప్ సపోర్ట్ పార్టీ'గా మారింది..
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ రేప్’కేసులో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రులు ఎందుకు స్పందించలేదని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, ఒక్క తెలంగాణలోనే రోజుకు ఆరు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలపై అత్యాచారాలకు నిరసనగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాం«దీభవన్‌లో చేపట్టిన మౌనదీక్షలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన డిసౌజా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేప్ సపోర్ట్ పారీ్టగా మారిపోయిందని, ఈ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలిక రేప్ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడి ప్రమేయం చూస్తే తెలంగాణలో పాలిటిక్స్ గూండాగిరీ నడుస్తోందని, మద్యం, డ్రగ్స్ పెరిగాయని ధ్వజమెత్తారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, ఆమెకు న్యాయం జరిగేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని డిసౌజా చెప్పారు. దీక్షలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, నీలం పద్మలతో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. డీజీపీకి వినతిపత్రం: అంతకుముందు మహిళా కాంగ్రెస్ నేతలు డిసౌజా, కొండా సురేఖ, సునీతారావు తదితరులు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. -
చేర్యాలలో ‘పొన్నాల’ రోడ్ షో
చేర్యాల, న్యూస్‌లైన్: టీపీసీసీ చీఫ్, జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య మం డలకేంద్రంలో గురువారం ప్రచారం నిర్వహించారు. హెలికాప్టర్లో చేర్యాలకు వచ్చి న ఆయనకు ఎమ్మెల్సీ నాగపూరి రాజలిం గం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మాజీ ఎమ్మెల్యె గొర్ల సిద్దయ్య, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, మొగుళ్ల రాజిరెడ్డి, బక్క నాగరాజు, పుల్ల భాస్కర్, కొమ్ము రవి, ఉడుముల భాస్కర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంత రం మార్కెట్ యార్డు నుంచి నేరుగా బహిరంగ సభకు వరకు వాహనంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నినాదాలతో సభ వరకు పాదయాత్ర చేశారు. చేర్యాల సినిమా టాకీసు నుంచి అంగడి బజారు వరకు పలువురు ఓటర్లతో పొన్నాల లక్ష్మ య్య వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థించా డు. చేర్యాల రోడ్ షోలో వాహనంలో నుంచి అభివాదం చేస్తూ కరాచాలనం చే శారు. చేర్యాలలోని రైతులతో మాట్లాడి పత్తి అమ్ముతూ, హోటల్ దగ్గర ఉన్న ఓటర్లను చాయ్ పోస్తూ, చెరుకు రసం అమ్ముతున్న ఒక మహిళ వద్దకు వెళ్లి చెరుకు రసం తాగుతూ ప్రచారం చేశారు. చేర్యాలలోని అంగడి బజారు వద్ద ఉన్న బహిరంగ సభకు చేరుకున్న పొన్నా ల సభకు వచ్చిన జనంలో కొంత సేపు కూర్చొని అందరిని ఆశ్చర్య పరిచారు. అనంతరం బహిరంగ సభలో మధు ప్రియ పాటలు జనాన్ని ఆకట్టుకోగా పొన్నాల లక్ష్మయ్య ఆమె పాటకు కోరస్ ఇచ్చాడు. చేర్యాల బహిరంగ సభలో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతుండగా వీరన్నపేట గ్రామస్తులు ఆందోళన చేశారు. చేర్యాలకు టీపీసీసీ అధ్యక్షుడిగా తొలిసారి రావడంతో యువకులు, కార్యకర్తలు పూలు చల్లుతూ పొన్నాలకు జేజేలు పలికా రు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు ముస్త్యాల కిష్టయ్య, భరణం నర్సయ్య, నాగమల్ల భిక్షపతి, కొమ్ము నర్సింగరావు, హరికాంత్‌రెడ్డి, కట్కూరు శ్రీనివాస్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, తాడెం రంజి త, తాడెం క్రిష్ణమూర్తి, కాటం మల్లేశం, పిన్న మల్లేశం, జిల్లా రాజేశం, బుడిగె గురువయ్య పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement