-
వివాహిత ఆత్మహత్య
తాడిపత్రి : పట్టణంలోని పాతకోటలో వెంకటసుబ్బమ్మ(32) అనే మహిళ శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా భార్త రామాంజనేయులు, ఆమె ఘర్షణ పడుతుండేవారని, దీనికి తోడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో అత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆ అంగన్వాడీ టీచర్ మాకొద్దు
బి.కోడూరు : విధులకు సరిగా రాకుండా పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించని అంగన్వాడీ టీచర్ మాకు వద్దు అంటూ శుక్రవారం మండలంలోని మరాటిపల్లె గ్రామప్రజలు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అంగన్వాడీ టీచర్ వెంకటసుబ్బమ్మ పనితీరు బాగా లేదంటూ గ్రామస్తులు రెండు వారాల కిందట గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు తెలియచేశారు. దీనిపై శుక్రవారం సీడీపీఓ రాజమ్మ విచారించారు. బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఎలా అందిస్తున్నారని గ్రామంలో అడిగారు. అలాగే రికార్డులను పరిశీలించా రు. పౌష్టికాహారాన్ని సరిగా అందించడం లేదని, ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదన్నారు. ఆమె అంగన్వాడీ టీచర్‌గా ఉన్నంత వరకు ఆ కేంద్రానికి తమ పిల్లలను పం పమని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు అంగన్వాడీ టీచర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ నివేదికలను జిల్లా అధికారులకు పంపుతామని, వారి ఆదేశానుసారం చర్య లు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్ణ, ఆయా, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సహనమూర్తి...సేవాస్ఫూర్తి..!
వైద్యుడు రోగికి మందుల చీటీ రాసిచ్చి తన పాత్ర పూర్తయిందనుకోకుండా మందులు కొనుక్కోమని డబ్బిస్తుంటే ఏమనాలి? డాక్టర్ ఎం. శ్రీనివాసరావు అనాల్సిందే. ఇలా ఎన్నాళ్లు చేస్తారంటే ‘చేయాలనే మనసు ఉండాలే కానీ ఇదేమంత కష్టం కాద’టారాయన. ‘‘నేను ఇదంతా చేస్తున్నది మా అమ్మకోసమే! అమ్మ కోసం చేసే పని భారమనిపించదు. నన్ను డాక్టర్ని చేయడానికి మా అమ్మ పడిన కష్టంతో పోలిస్తే నేను జనానికి చేస్తున్న సహాయంలో అసలు కష్టమే లేదు. చేతినిండా డబ్బు ఉండి నన్ను డాక్టర్ని చేయలేదు, కొడుకుని డాక్టర్ని చేయాలనే తపనతో పైసాపైసా కూడబెట్టి నన్ను చదివించింది. మనసున్న డాక్టర్‌గా పేరు తెచ్చుకోమని కోరింది. అందుకే నేను డాక్టర్నయిన తర్వాత మా నాన్న పేరుతో క్లినిక్ తెరిచాను, అమ్మ పేరుతో చారిటీ ప్రారంభించి ఉచితంగా వైద్యం చేస్తున్నాను’’ అని కూడా అంటారు. హైదరాబాద్‌లోని డి.డి కాలనీలో డాక్టర్ శ్రీనివాసరావు ఇంటికి వెళ్లగానే మొదట వారి తల్లి వెంకటసుబ్బమ్మ కనిపించారు. మాటలు కలిపాక... ‘‘మాది కడప జిల్లా కొత్తనెల్లూరు, మా వారిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పొనుగోడు. ఆయనకు హైదరాబాద్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్లో క్లర్కు ఉద్యోగం వచ్చింది. నాకు ఐదుగురు పిల్లలు. శ్రీనివాస్ ఆఖరివాడు. అబ్బాయిని డాక్టర్ని చేయాలని మావారి కోరిక. ఆయన అలా అంటుంటే నాకూ సంతోషంగా ఉండేది. అనుకున్నట్లే మెడిసిన్‌లో చేర్చాం. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు. ఏడాదిలోపే మా జీవితంలో పిడుగుపడినట్లయింది. మా వారు హఠాత్తుగా పోయారు. ఇల్లు గడవాలి, పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇన్ని బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి. కాంపెన్సేటరీ గ్రౌండ్స్ ప్రకారం మా వారి ఉద్యోగం ఇచ్చారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో స్వీపర్ ఉద్యోగం తప్ప మరే ఉద్యోగానికీ అర్హత లేదు. స్వీపర్‌గా నాకు వచ్చే జీతంతో ఇల్లు గడుస్తుంది కానీ చదువుల ఖర్చు భారంగా ఉండేది. నా బాధ చూసి శ్రీనివాస్ మెడిసిన్ మానేసి దొరికిన ఉద్యోగంలో చేరతానని పట్టుపట్టాడు. ‘నిన్ను డాక్టర్ని చేయాలన్న మీ నాన్న కోరిక తీర్చడానికి నేనింత కష్టపడుతున్నాను. నిన్ను డాక్టర్ని చేసినప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. నీ చదువు మాన్పించడం నాకిష్టం లేదు. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసి తెచ్చే జీతం డబ్బుని నేను సంతోషంగా ఖర్చుచేయలేను కూడ. డాక్టర్‌గా సంపాదించిన డబ్బుతో నన్ను పోషించు. డాక్టర్‌గా పదిమందికి సహాయం చేయడమే నాకు సంతోషం. ఈ నాలుగేళ్లు కష్టపడడానికి నేను సిద్ధమే’ అని చెప్పాను. ఇక నా కష్టం అంటావా తల్లీ! నేను ఎవరి కోసం కష్టపడ్డాను, నా బిడ్డ కోసమే. పేదోళ్లకు అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోలేక ఎన్ని అవస్థలు పడతారో తెలుసుకుని మసులుకోమని మాత్రం చెప్పేదాన్ని. అప్పటి నా మాట పట్టుకుని ఇంతమందికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడని ఊహించలేదు. టీవీల్లో కనిపించే పెద్దోళ్లు, భరణి సారు, కోడి రామకృష్ణ సారు లాంటి గొప్పోళ్లు ఫోన్ చేసి ‘ఎంత మంచి కొడుకుని కన్నావమ్మా, నీ బిడ్డ సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి వైద్యం చేస్తున్నాడో! లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్టులకు ఉచితంగా వైద్యం చేస్తాడు అంతా నీ పెంపకంలో గొప్పదనమే’ అని ప్రశంసిస్తుంటే నాకు మనసు నిండిపోతుంటుంది’’ అన్నారామె కళ్లు చెమర్చు తుండగా. రోజుకు మూడుషిఫ్టుల్లో... ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు సరూర్‌నగర్‌లో ఇంటి వద్ద ఉచిత వైద్యం, ఆ తర్వాత హాస్పిటల్లో డ్యూటీ. మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం, సాయంత్రం ఆరు నుంచి పది గంటల వరకు అంబర్‌పేటలో సొంత క్లినిక్ బాధ్యతలు... ఇలా రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు డాక్టర్ శ్రీనివాస్. ఈ తల్లీకొడుకులిద్దరూ స్వతహాగా గాయకులు. ఆకాశవాణి కార్యక్రమాల్లో రేడియో అక్కయ్య, అన్నయ్యలతో గొంతుకలిపిన అనుభవం వెంకటసుబ్బమ్మది. ఆమె ఏడేళ్లపాటు రేడియోలో దేశభక్తి గీతాలు, దైవభక్తి గీతాలు ఆలపించారు. భర్తపోయి, ఉద్యోగంలో చేరిన తర్వాత గాయనిగా కొనసాగడం కష్టమైంది. కానీ తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శ్రీనివాసరావు జానపద గేయాలు పాడతారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు. సినిమాల్లో నటిస్తారు. అయితే అవన్నీ డాక్టర్ పాత్రలే. ఇప్పటికి 45 సినిమాలు, సీరియల్స్‌లో డాక్టర్‌గా కనిపించారు. అమ్మా! నీకు వందనం!! సినీ పరిశ్రమలోని అభిమానులు సన్మానం చేస్తామన్నప్పుడు డాక్టర్ స్పందించిన తీరులో ఆర్ద్రత వ్యక్తమైంది. ‘మీకు కనిపిస్తున్న ఈ రూపం, ఈ వ్యక్తిత్వం, దయాగుణాలకు కారకురాలైన మా అమ్మకు సన్మానం చేయండి’ అన్నారాయన. అలా 2011లో రవీంద్రభారతిలో వెంకటసుబ్బమ్మకు జరిగిన సన్మానాన్ని తలుచుకుంటూ... ‘‘మా అమ్మ అక్కినేనిగారి అభిమాని. నన్ను ఆయనకు పరిచయం చేసుకుని మా అమ్మకు మీ చేతుల మీదుగా సన్మానం చేయమని అడిగాను. మదర్స్‌డే రోజున ఆయన చేతుల మీదుగా జరిగిన సన్మానంలో పిల్లలకు దూరమై వృద్ధాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న అమ్మలెందరో ఉన్నారు. వారికి కూడా కొడుకుగా మారి చేయగలిగింది చేయమని సూచించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి ఉచిత వైద్యం చేయడమే కాదు, మాకొచ్చే శాంపిల్ మందులిచ్చేవాడిని. చాలా వృద్ధాశ్రమాల్లో నిర్వహణ సరిగ్గా లేక వృద్ధులు అనారోగ్యం పాలవుతున్నారని తెలిసి, ఓ మోడల్ హోమ్ ప్రారంభించాను. నీకు మించిన బరువును తలకెత్తుకుంటున్నావేమో జాగ్రత్త అంటోంది మా అమ్మ. సంకల్పబలమే నడిపిస్తుందనే నమ్మకంతో సాగిపోతున్నాను’’ అన్నారీ డాక్టర్. - వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎస్ఎస్ ఠాకూర్ మాటల్లో చెప్పలేనంత సంతోషం! అప్పుడు మా శ్రీనివాస్ మెడిసిన్ తొలి ఏడాది చదువుతున్నాడు. నాకు వెన్నెముకకు ఆపరేషన్ అయి బెడ్ మీదున్నాను. అప్పుడే కాలేజ్‌లో ప్రాక్టికల్స్‌కి కోటుతో వెళ్లాలనగానే మా వారు తెచ్చారు. నిన్ను కోటులో చూడాలని ఉందని అడిగాను. ఇంటికెళ్లి కోటుతో వచ్చాడు. అప్పుడు కంటినిండా చూసుకుని, దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఆ రోజు పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. - వెంకట సుబ్బమ్మ, డాక్టర్ శ్రీనివాసరావు తల్లి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement