-
ఐదారు రోజుల్లో మరో రూ.2,020 కోట్లు
మూడో విడత రుణమాపీని బ్యాంకులకు విడుదల చేస్తాం: పోచారం సాక్షి, హైదరాబాద్: మూడో విడత విడుదల చేయాల్సిన రుణమాఫీలో మిగిలిన సగం సొమ్మును ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధిపతులతో మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహిం చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడో విడతలో సగం రూ. 2,019.99 కోట్లు ఇటీవల విడుదల చేశామని... మిగిలిన రూ. 2,020 కోట్లు ఐదారు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఆగస్టు ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో సరాసరి 371.2 ఎం.ఎం. వర్షం కురవాల్సి ఉండగా... 435.9 ఎం.ఎం. కురిసిందని వివరించారు. ఆరుతడి పంటలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని.. మొత్తం 70 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయన్నారు. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గమే హరితహారంలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. -
పావులో సగం
- మూడో విడత రుణమాఫీలో సగం నిధులిచ్చిన సర్కారు - మరో నెల రోజుల్లో మిగతా సగం.. - తెలంగాణ ప్రభుత్వంలో రుణమాఫీ కింద వచ్చింది - ఇప్పటివరకు రూ.1,500 కోట్ల పైమాటే - ఇంకా రావాల్సింది రూ. వెయ్యి కోట్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కర్షకులపై సర్కారు కరుణించింది.. కానీ అది పావులో సగమే . మూడో విడత రుణమాఫీ కింద రూ. 570 కోట్లకు పైగా జిల్లాకు రావాల్సి ఉండగా, అందులో సగం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత రుణమాఫీ కింద రూ. 4,380 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.2,190 కోట్లు ఇస్తూ జీఓ జారీ చేసింది. అంటే.. మూడో విడత ఇవ్వాల్సిన దాంట్లో సగమే మం జూరు చేయడంతో జిల్లాకు రావాల్సి న రూ.570 కోట్లలో సగం... అంటే రూ. 285 కోట్లకు పైగా నిధులు బ్యాంకుల్లో జమ కానున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో పావులో సగం నిధులిచ్చిన ప్రభుత్వం మరో పావుశాతం నిధులను ఇచ్చేందుకు నెలరోజులు పడుతుందని చెబుతోంది. ఇప్పటివరకు రూ.1500 కోట్ల పైమాటే జిల్లాలో రుణమాఫీ కింద దాదాపు 5లక్షల మంది రైతాంగానికి రూ. 2500 కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ, 2014 సెప్టెంబర్ 3న మొదటి విడత రుణమాఫీ, 2015 జూన్ 20న, 2015 జూలై 31న రెండు దఫాల్లో రెండో విడత రుణమాఫీ కింద నిధులను విడుదల చేసింది. ఇక, ఆ తర్వాత మళ్లీ 2016 జూన్ 25న మూడో విడతలో సగం విడుదల చేసింది. రెండు విడతలకు గాను రూ.1250 కోట్లు, మూడో విడతలో సగం మరో రూ.270 కోట్ల వరకు కలిపి రూ.1500 కోట్ల వరకు ఇప్పటివరకు రుణమాఫీ కింద నిధులు మంజూరయ్యాయి. మరో రూ.1000 కోట్ల బకాయిలు అంతే ఉన్నాయి. దేవుడు కరుణించాడు కానీ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో అన్నదాతలకు పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్న ఆలోచనతో మూడో విడత రుణమాఫీలో సగం నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నా... తాజాగా విడుదల చేసిన నిధులు రైతాంగానికి ఏ మాత్రం ఉపయోగపడతాయనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే.. రుణమాఫీ సాకు చూపి గత మూడు సీజన్లుగా రైతులకు బ్యాంకర్లు రుణాలివ్వడం కోసం అనేక కొర్రీలు పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు జిల్లాలోని రైతులకు రూపాయి కూడా రుణాలివ్వలేదు. అసలు కౌలురైతుల పరిస్థితి అయితే ఆగమ్యగోచరం. ఈ పరిస్థితుల్లో పావులో సగమైనా సర్కారు కరుణ చూపిందిలే అని తృప్తి పడాలా.... సరిపడా కరుణ ఎప్పుడు చూపుతారోనని మధనపడాలో జిల్లా రైతాంగానికి అంతుపట్టడం లేదు. మరి, ప్రభుత్వం ఇచ్చిన ఈ పావు సగం నిధులతో బ్యాంకర్లు సరిపెట్టుకుంటారా...? మిగిలిన సగం రావాలని, నాలుగో విడత నిధులు కూడా రావాల్సిందేనని మెలిక పెట్టి ఎప్పటిలాగే రైతన్నను బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారా..? అన్నది అన్నదాత అదృష్టంపై ఆధారపడి ఉన్నట్టే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement