-
టారో : 29 అక్టోబర్ నుంచి 4 నవంబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ మనసుకు నచ్చిన పని చేయడం ద్వారానే మీదైన గుర్తింపు పొందగలరని గుర్తించండి. కాస్త ఆలస్యమైనా, ఈ పనిలో విజయం మీవైపే ఉంటుంది. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఏదైనా ప్రేమలేఖ రాసివ్వండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మీ ఆలోచనా విధానానికి తగ్గ నిర్ణయమే తీసుకోండి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోండి. ప్రశాంతంగా ఉండడం అలవర్చుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త పనులు మొదలుపెడతారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం ఈ కొత్త పనుల్లో సాధిస్తారు. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం మానండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అయితే మీ జీవిత భాగస్వామితో ఎదురయ్యే గొడవలు కూడా మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేసేవే. ఇష్టంగా వారి మనసును గెలుచుకునే ప్రయత్నం చేయండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. కలిసివచ్చే రంగు : పీచ్ మిథునం (మే 21 – జూన్ 20) ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం ఇది. చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీ ప్రయత్నంలో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. వృత్తిరీత్యా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ స్థాయికి తగిన అవకాశాలైతేనే ఎంచుకోండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. కలిసివచ్చే రంగు : నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బందిపెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి. జీవితంలో ఏది జరిగినా అంతిమంగా అది అలాగే జరుగుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ ముందుకెళ్లండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ కొత్త అవకాశాల ద్వారానే మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గుర్తింపు దక్కుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈ వారం మీకు కొన్ని ఊహించని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోండి. వృత్తిరీత్యా మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశం వస్తే వెంటనే మీదైన ప్రతిభ చూపించేందుకు సిద్ధమైపోండి. ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు చేసేందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : ముదురు గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీదైన శైలిలో పనిచేస్తూ పోతే, మీకు ఎదురులేదన్న విషయాన్ని ఎప్పట్లానే బలంగా నమ్ముతూ ముందుకు వెళ్లండి. ప్రతికూల ఆలోచనలన్నీ పక్కనపెట్టేయండి. వృత్తిజీవితం కొత్తగా ఉంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మరింత మెరుగవుతుంది. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉండదు. విహార యాత్రలకు సన్నాహాలు చేయండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి. కలిసివచ్చే రంగు : ఎరుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీకు ఎలాంటి అవకాశాలు తెచ్చిపెడుతుందో కొద్దిరోజుల్లోనే చూస్తారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలను దగ్గరకు కూడా రానివ్వకండి. కొత్త మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పు మీ జీవితాశయం వైపుకు పడే మొదటి అడుగు అన్న ధైర్యంతో ఉండండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థాలు వచ్చే సూచనలున్నాయి. వారికి ఎక్కువ సమయం కేటాయించి మీ ప్రేమను చాటుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : వెండి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ బాధ్యతలేంటో, ఆలోచనలేంటో సరిగ్గా తెలుసుకోవాల్సిన సమయం ఇది. మీ జీవితాశయాన్ని చేరుకోవడానికి ఎప్పట్నుంచో వెనుకడుగు వేస్తూ వస్తున్నారు. దానికి ఇదే సరైన సమయం అని గ్రహించండి. మీ శక్తులేంటో గ్రహించి, వాటిని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని తేల్చుకోండి. మీదైన గుర్తింపు దక్కాలంటే మీ శక్తినంతా కూడగట్టాలన్న విషయం మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి బహుమతినివ్వండి. కలిసివచ్చే రంగు : బంగారం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈ వారమంతా మీకు శుభ సూచకంగానే కనిపిస్తోంది. ఊహించని స్థాయి విజయం దక్కుతుంది. ఆ విజయం మీకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. మీపై మీకున్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఆత్మ విశ్వాసంతో కొత్త పనులు మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకోయే మీ ఆలోచనా విధానమే మీకు అన్నివిధాలా తోడ్పడుతుందని గ్రహించండి. కలిసివచ్చే రంగు : పసుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) గతాన్ని గురించి ఆలోచిస్తూ కొన్ని అద్భుతమైన అవకాశాలను కోల్పోతున్నారన్న విషయాన్ని గ్రహించండి. మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చే ఈ అవకాశాలను ఆత్మస్థైర్యంతో స్వీకరించండి. విజయం మీ వైపే ఉందన్న విషయాన్ని మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్న కొత్త విషయాన్ని ఇప్పుడే నేర్చేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాయామం మొదలుపెడితే మంచిది. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాశం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, అందుకు మీరు ఎంచుకోవాల్సిన మార్గం ఏంటో నిర్ణయించుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి జీవితం కొంత నిరాశాజనకంగానే ఉంటుంది. అయితే అన్నీ కుదురుకునే వరకూ మీ ప్రయత్నాల్లో మాత్రం లోటు అనేది ఉండకుండా చూసుకోండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రలకు సన్నాహాలు చేయండి. కలిసివచ్చే రంగు : నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన సమయం ఇదే. ఏదీ చేయలేమంటూ ఒక దగ్గరే ఆగిపోయే మీ ఆలోచనలకు స్వస్తి పలకాలి. మీ శక్తి, సామర్ధ్యాలు ఏంటో తెలుసుకొని ఆ దిశగా కష్టపడితే ఫలితం కనిపిస్తుంది. ప్రేమ జీవితం కొంత కలవరపెడుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీదైన గుర్తింపు కోసం శక్తియుక్తులన్నీ పెట్టాలని నమ్మండి. కలిసివచ్చే రంగు : గోధుమ -
టారో : 22 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కొండి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది. కలిసివచ్చే రంగు : పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాధించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్రలకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ విషయం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లండి. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని నిరంతరం ఆస్వాధించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ -
టారో : 17 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తిరీత్యా పదోన్నతి పొందుతారు. ఏదీ కష్టపడకుండా పొందలేరని గ్రహించి పనిచేయండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, పనిలో మీదైన గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతర శ్రమ అవసరం. కొద్దికాలంగా మిమ్మల్ని కలవరపెడుతోన్న విషయాలన్నీ సద్దుమణిగి అంతా మంచే జరుగుతుంది. ప్రేమ జీవితంలో చిన్న కలవరపాటు. అయితే అది కూడా మంచికే అనుకోండి. కొద్ది రోజులు సంయమనంగా ఉండండి. మీరు అనుకున్నట్లుగా జీవితం సాగిపోతుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వృత్తిరీత్యా మీకు అన్నీ మంచి రోజులే! మీ జీవిత ఆశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయమిది. కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో మీరు కలలుగన్న స్థాయిని చేరుకుంటారు. పని, ప్రేమ జీవితం మధ్యన సంయమనం కుదుర్చుకోండి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. వారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. ఎప్పట్నుంచో కోరుకుంటున్న మార్పు దగ్గరలోనే ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడిని పూర్తిగా మీద వేసుకొని కుమిలిపోకండి. కాస్త విశ్రాంతి అవసరమని గ్రహించండి. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వండి. త్వరలో విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆధ్యాత్మిక అంశాల వైపుకు మీ ఆలోచనలు వెళతాయి. అది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగవుతుంది. మీపై మీకున్న ఆత్మవిశ్వాసం చెదరకుండా చూస్కోండి. ధైర్యంగా పనిచేస్తూ వెళ్లండి. ప్రేమ విషయంలోనూ మనసు పెట్టి నిర్ణయం తీసుకోండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. మీరు కోరుకునే ఆనందం అక్కడే ఉంది. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చేపట్టే కొత్త పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. ప్రశాంతంగా ఉంటూ మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచగలిగే ఆలోచన చేయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీదైన ఆలోచన విధానం, నడవడిక మీ ఉన్నతికి తోడ్పడేదని ఎప్పుడూ మరచిపోకండి. కలిసివచ్చే రంగు : తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోన్న సమస్యలు మరికొద్ది రోజులు కూడా అలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులకు భయపడి నిరుత్సాహం చెందకండి. చెడు జరిగిపోతుందని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పరిస్థితులపై పోరాడండి. ఆస్తి సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తూ, మీ కష్టాన్నంతా వెచ్చిస్తూ వస్తున్నారు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడానికి మరెన్నో రోజులు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఈ వారమో, మరో రెండు వారాల్లోనో శుభవార్త వింటారు. అంతా మంచే జరుగుతుంది. జీవితమంతా కుదురుగా ఓ సరైన చోట ఆగినట్లు అనిపిస్తుంది. అదే మీరు కోరుకున్న సంతృప్తి అని బలంగా నమ్మండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ వారమంతా మీరు ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. రానున్న రోజులు కూడా ఇంతే ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. జీవితమంటేనే వేడుక అని మీరు నమ్మే సిద్ధాంతాన్నే ఎప్పటికీ మరవకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తడబడతారు. అయితే అది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మీ అనుభవానికి తగ్గ పనులు చేస్తూ ఉండండి. మీ ఆలోచనల్లో మీ స్థాయి ఉండడం లేదన్న విషయం గమనించండి. అదే మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన అంశం కూడా! మార్పు కోరుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం. ప్రేమ జీవితంలోనూ కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఈ పరిస్థితులన్నీ మీ ఆలోచనలను విపరీతంగా ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు : గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. మీ ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసమే మీకు ఆయుధమన్న విషయాన్ని నమ్మండి. మీ బలమేంటో ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయమిది. కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీకు ఎంతగానో ఉపకరించే ఆ అవకాశాలను వదులుకోవద్దు. ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలోనే వదిలిపెట్టే ఆలోచనలు చేస్తున్నట్లైతే అలాంటివి మానుకోండి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) భవిష్యత్‌పై నమ్మకాన్ని సడలనివ్వకండి. ఇప్పుడు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నట్లు కనిపిస్తోన్న పరిస్థితులన్నీ తాత్కాలికమేనని నమ్మండి. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలన్నీ సర్దుకుంటాయి. ప్రేమ జీవితం కాస్త కలవరపరుస్తుంది. ఎక్కువ ఆలోచించి నిరాశ చెందకండి. ఏ కొత్త అవకాశం మీకోసం ఎదురుచూస్తున్నా, ఇదే సరైన సమయమని నమ్మి ముందుకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : పసుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పిల్లలు, ఉద్యోగం, జీవితం మీద అభద్రతా భావం మిమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఇదేమీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూసుకోండి. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారికి కాస్త సమయం కేటాయించాలన్న విషయం మరవకండి. బంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకోండి. కలిసివచ్చే రంగు : ఎరుపు -
టారో : 10 సెప్టెంబర్ నుంచి 16 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడమన్నదే మీ ఉన్నతికి అడ్డుపడుతున్నదని గ్రహించండి. ప్రతికూల ఆలోచనలను పూర్తిగా దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. చెడు వ్యసనాలకు దూరం అయ్యేందుకు ఇదే సరైన సమయం. చేసే పని మీద శ్రద్ధ పెడితే విజయం మీవైపే ఉంటుంది. ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కలిసివచ్చే రంగు : బూడిద వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తగా మొదలుపెట్టిన మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసమే మీ పెట్టుబడి అని నమ్మండి. వృత్తి రీత్యా పెద్ద పదవిని అలంకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పదవిని ధైర్యంగా స్వీకరించి మీదైన ముద్ర వేయండి. కొన్ని ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సవాళ్లకు భయపడకుండా వాటిని ఎదుర్కొండి. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) కొద్దికాలంగా అభద్రతతో కష్టంగా జీవితం వెళ్లదీస్తున్న మీకు ఇకపై వచ్చేదంతా మంచి కాలమే! మీ శక్తులేంటో, మీరు చేయగలిగింది ఏంటో సమీక్షించుకోండి. స్థిమితమైన ఆలోచనలు వచ్చేవరకూ ఏ కొత్త నిర్ణయాన్నీ తీసుకోకండి. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ముందు భయాలన్నింటినీ దూరం చేసుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు మరింత దగ్గరవుతారు. వారి రాకతో మీ జీవితం కొత్త వెలుగులు నింపుకుంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపు తిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం మీకు త్వరలోనే వస్తుంది. నిరాశ చెందకుండా పనిచేస్తూ ఉండండి. మీ నమ్మకమే మీకు ఆయుధం. వృత్తిరీత్యా కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి. అది మీ మంచికే అని నమ్మండి. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పట్నుంచో కారు కొనాలని భావిస్తున్నట్లైతే వెంటనే వెళ్లి కొనేయండి. ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ప్రేమ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. మీరిప్పుడు ఇదే విషయం గురించే ఆలోచించకపోయినా మీ జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ ఇష్టాలేంటో జాగ్రత్తగా గుర్తించండి. ఎందుకంటే ఆ నిర్ణయం మీ జీవితం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది. వృత్తిరీత్యా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు మీకు మంచే చేస్తుందని విశ్వసించండి. కలిసివచ్చే రంగు : నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇప్పటివరకూ కష్టంగా చేస్తూ వస్తోన్న పనికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఇది. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఆ అవకాశాలను నిర్లక్ష్యంతో దూరం చేసుకోకండి. మీరు కోల్పోయిన ఉత్సాహమంతా తిరిగి వస్తుంది. అదే ఉత్సాహంతో పనిచేయండి. విజయాన్ని త్వరలోనే ఆస్వాదిస్తారు. పనులన్నీ చకచకా జరిగిపోతాయి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఏ పనీ సరిగ్గా జరగడం లేదని చింతిస్తూ కూర్చోకండి. ఇదంతా తాత్కాలికమేనని, ముందున్నది అంతా మంచి కాలమే అని నమ్మండి. ఎవరికోసమో, దేన్నో త్యాగం చేస్తూ కూర్చోకుండా మీ ఉన్నతికి తోడ్పడే పనులను మీదైన శైలిలో చేస్తూ వెళ్లండి. అంతా గందరగోళంగా తయారైనట్లు కనిపిస్తే, భయపడిపోకండి. అన్నీ క్రమంగా సర్దుకొని జీవితమంతా సాఫీగా సాగుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ప్రేమ జీవితంలో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న పరిణామానికి ఇదే సమయం. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో, ఏ పని చేసినా విజయం సాధించగలమన్న ధీమాతో ముందుకు వెళ్లండి. వృత్తి పరంగా మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పనిలో ఉత్సాహంగా ఉంటారు. మీరు పనిచేసే చోట ఎనిమిది నారింజ పండ్లు ఉంచుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఒంటరితనాన్ని కొద్దికాలంగా బాగా ఇష్టపడుతూ వస్తున్నారు. జీవితం ఏ వైపు వెళుతుందోనన్న అనుమానం మిమ్మల్ని అలాగే వెంటాడుతుంది. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయకుండా చూసుకోండి. కొంత విశ్రాంతి తీసుకోండి. అంతా చక్కబడుతుంది. అనాలోచితంగా ఏ నిర్ణయమూ తీసుకోకండి. ఒత్తిడికి లోనుకాకండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. మీకు విశ్రాంతి ఎంతో అవసరం. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. అనాలోచితంగా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. మీ అనుభవాన్ని సరిగ్గా వాడుకోండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. పరిస్థితుల నుంచి తప్పించుకోకుండా మీదైన శైలిలో ధైర్యంగా ఎదుర్కోండి. ఎక్కువ శ్రమ పడకుండా ప్రశాంతంగా పని చేసుకుంటూ వెళ్లండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఏదో చెడు జరగబోతోందని మిమ్మల్ని మీరే నిరుత్సాహపరచుకోకండి. ప్రస్తుతానికి మీరు కోరుకున్నట్లుగా పనులేవీ జరగకున్నా, తాత్కాలికమేనని గ్రహించండి. కొన్ని రోజులు ఓపిక పడితే ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. భయపడకుండా మీ పని మీరు చేస్తూ వెళ్లండి. దీన్నే అలవాటుగా మార్చుకుంటే కోరుకున్నవన్నీ క్రమక్రమంగా జరుగుతాయి. కలిసివచ్చే రంగు : గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎన్ని అవాంతరాలు ఎదురైనా నమ్మకమే మీ ఆయుధం. ఆ నమ్మకంతోనే పనిచేయండి. ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగం మారాలనో, మీకిష్టమైన రంగం వైపుకు వెళ్లాలనో... ఇలా మీ ఆలోచనల్లో ఏ కొత్త విషయం కోరుకుంటున్నా ఆ వైపు నిస్సంకోచంగా అడుగులు వేయండి. కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. కలిసివచ్చే రంగు : పసుపు -
టారో : 3 సెప్టెంబర్ నుంచి 9 సెప్టెంబర్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. వినాయకుడి ఆశీస్సులు మిమ్మల్ని వెన్నంటే ఉంటాయి. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. వినాయకుడిపై నమ్మకం ఉంచండి. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. వినాయకుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. వినాయకుడిని ఇష్టంగా కొలవండి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి. కలిసివచ్చే రంగు : వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వినాయకుడిని పూజించండి. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి. కలిసివచ్చే రంగు : నలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి. కలిసివచ్చే రంగు : ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. వినాయకుడిపై నమ్మకం ఉంచి పనిచేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి. కలిసివచ్చే రంగు : బూడిద
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
కాంగ్రెస్‌లో పలువురి చేరిక
చిరు జల్లులతో ఉపశమనం
మత్స ్య సంపద ౖపైపెకి..
దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement