-
షర్బత్ గులా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ఇస్లామాబాద్ : నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన షర్బత్ గులా బెయిల్ విజ్ఞప్తిని పాకిస్తాన్ న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టివేసింది. కాగా నకిలీ గుర్తింపు పత్రాలు కలిగి ఉందంటూ గతనెల 26న గులాను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. నిన్న (మంగళవారం) పెషావర్ ప్రత్యేక కోర్టు షర్బత్ గులా కేసుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఆమె బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది. గులా దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు, 3 వేల నుంచి 5 వేల డాలర్ల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న వేలాది మంది అఫ్గాన్ శరణార్థుల్లో షర్బత్ గులా ఒకరు. అలా వలస వచ్చిన ఆమె పాక్ జాతీయుడినే పెళ్లాడింది. గులాకు ముగ్గురు పిల్లలు. పెషావర్ సమీపంలోని నోతియాలో నివాసం ఉంటున్న ఆమె 2014లో పాక్ గుర్తింపు కార్డు కోసం షర్బత్ బీబీ పేరుతో దరఖాస్తు చేసుకుంది. ఆమె ఆప్ఘన్-పాకిస్తాన్ దేశాల డాక్యుమెంట్లు కలిసి ఉండటంతో మోసం ఆరోపణల కింద ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన షర్బత్ గులాకు 12 ఏళ్లు ఉన్నపుడు 1985లో నేషనల్ జియోగ్రఫిక్ మేగజీన్ తన కవర్‌పేజీపై ఆమె ఫొటోను ప్రచురించింది. ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెక్కర్రీ ఈ ఫోటో తీశారు. దీంతో షర్బత్ గులా ‘మొనాలిసా ఆఫ్ ఆఫ్గాన్’గా ప్రపంచం దృష్టిలో పడింది. అయితే ఫోర్జరీ పత్రాల కేసులో గులా అరెస్టు కావటం ఆమె మరోసారి వార్తల్లో కెక్కింది. మరోవైపు పాక్ సర్కార్ గులాను అరెస్ట్ చేయడాన్ని స్టీవ్ మెక్కర్రీ ఖండించారు. ఆమెను అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుందంటూ... గులాకు అండగా నిలబడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
'ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు'
న్యూఢిల్లీ: 1984లలో అఫ్గానిస్తాన్ వలసలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆకుపచ్చ కళ్ల ‘అఫ్గాన్ బాలిక’ షర్బత్ గులాను పాకిస్థాన్ అరెస్ట్ చేయడాన్ని ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెక్కర్రీ ఖండించారు. ఆమెను అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుందని పేర్కొన్నారు. షర్బత్ గులాకు అండగా నిలబడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉందన్న ఆరోపణలపై పాకిస్తాన్లో గులాను బుధవారం అరెస్ట్ చేశారు. దీనిపై మెక్కర్రీ స్పందిస్తూ...'పాకిస్తాన్ అధికారులు తీసుకున్న చర్య తీవ్ర ఆక్షేపణీయం. షర్బత్ గులా జీవితమంతా కష్టాలమయం. ఆమెను అరెస్ట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంద'ని మెక్కర్రీ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. గులాకు సహాయ పడాలని పాకిస్తాన్ ప్రముఖ మానవ హక్కుల అటార్నితో మాట్లాడినట్టు వెల్లడించారు. ఆమెకు అంతర్జాతీయ సమాజం మద్దతుగా నిలవాలని కోరారు. -
ఈ ఫొటో వెనక పెద్ద కథే ఉంది...
కాబూల్: ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన ఈ ఫొటో వెనక పెద్ద కథే ఉంది. అఫ్ఘాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని నజీర్ బాగ్ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న 12 ఏళ్ల పస్తూన్ బాలిక ఫొటో ఇది. యుద్ధాలు సృష్టించిన బీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు ఫొటోలు తీసే ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మ్యాక్కర్రీ 1984 డిసెంబర్ నెలలో ఈ ఫొటోను తీశారు. ‘నేషనల్ జియాగ్రఫిక్’ మేగజైన్ 1985లో యుద్ధం సృష్టిస్తున్న బీభత్సనికి బలవుతున్న ఆఫ్ఘాన్ బాల్యానికి ప్రతీకగా ఈ ఫొటోను కవర్ పేజీ మీద ప్రచురించింది. పస్తూన్ బాలిక కంటి చూపులో ఉన్న తీక్షత. తన ఈ దుస్థితికి ఎవరు బాధ్యులంటూ ప్రశ్నిస్తున్న క్రోదం వ్యక్తీకరణ. ముఖంలో ఉట్టిపడే గర్వం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. కేవలం ఈ ఫొటోను చూసి చలించిన ఎంతోమంది సామాజిక కార్యకర్తలు నజీర్ బాగ్ శరణార్థుల శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చి పని చేయడం ప్రారంభించారు. ఈ ఫొటో వ్యక్తిగతంగా ఫొటోగ్రాఫర్ స్టీవ్‌కు ఎంత పేరు తెచ్చిందో, నేషనల్ జియాగ్రఫిక్ మేగజైన్‌కు అంత పేరు తెచ్చింది. దాంతో అనాథ పిల్లలు, శరణార్థులను ఆదుకునేందుకు మేగజైన్ ‘అఫ్ఘాన్ చిల్డ్రన్ ఫండ్’ను ఏర్పాటు చేసింది. ఈ ఫొటోను తీసినందుకు అఫ్ఘాన్‌లో టాక్సీ డ్రైవర్లు ఎవరూ కూడా స్టీవ్ వద్ద చార్జీలు తీసుకోలేదట. ఈ విషయాన్ని ఆయనే ఇప్పుడు ఇటలీలో తన ఫొటో ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు ఆ పస్తూన్ బాలికకు 44 ఏళ్ల వయస్సుంటుందని, ఆమె ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్నట్లు తెల్సిందని ఆయన చెప్పారు. వీలు చూసుకొని ఆమెను కలసుకునే ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement