-
లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో
Ram Kapoor owns Porsche 911 Turbo S (992): ప్రముఖ టెలివిజన్ నటుడు రామ్ కపూర్, "బడే అచ్చే లాగ్తే హై" 'కసమ్ సే' లాంటి పాపులర్ టీవీ సీరియళ్లతోపాటు అనేక బాలీవుడ్ సినిమాలలో నటనతో తనకంటూ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్‌కు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ముఖ్యంగా పోర్షే కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల తన గ్యారేజ్‌లో మూడో కారును జోడించాడు. టాప్ వేరియంట్ స్పోర్ట్స్ కారు 992 టర్బో S కారును కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ. 3.6 కోట్లు. తాజాగా ముంబై రోడ్లపై కపూర్ తన కొత్త కారుతో షికారు చేయడం మీడియా కంటపడింది.ఇప్పటికే రెండు పోర్షే కార్లను సొంతం చేసుకున్న రామ్, తాజాగా మరో పోర్షే కారును అదీ టాప్ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం విశేషం. రామ్ కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా నటి పోర్షే 911 టర్బో S (992) విశేషాలు అత్యంత అధునాతన మోడల్ 911 టర్బో S వేరియంట్, 560 PS గరిష్ట పపవర్ ను, 700 Nm నుండి భారీ 750 Nm టార్క్ వస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ PDK ట్రాన్స్మిషన్ ఇందులో ఉన్నాయి. ఇది కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇవేకాదు 2021లో, రామ్ కపూర్ రూ. 2 కోట్ల విలువైన పోర్షే 911 కారెరా ఎస్‌ని కొనుగోలు చేశారు. ఇంకా రూ. 4.5 కోట్ల విలువైన ఫెరారీ పోర్టోఫినో ఎం , పోర్టోఫినో M పవర్,మెర్సిడెస్-AMG G63 లాంటి లగ్జరీ కార్లు రామ్ కపూర్ సొంతం. వీటితోపాటు బీఎండబ్ల్యూ ఆర్ 18, ఇండియన్ రోడ్‌మాస్టర్ డార్క్ హార్స్ , బీఎండబ్ల్యూ K 1600 B సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి. -
1.83 కోట్ల విలువైన కారు కొన్న బుల్లితెర నటుడు
Ram Kapoor New Car: ప్రముఖ బుల్లితెర నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. సుమారు 1.82 కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన పోర్షే 911 కరీరా ఎస్ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని, పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు.. ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? అయినా.. మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా న్యాయ్ సీరియల్‌తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్ కపూర్... హీనా, సంఘర్ష్, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక హిందీ టెలివిజన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్ నిర్మించిన ఘర్ ఏక్ మందిర్‌తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హమ్‌షకల్స్, ఉడాన్, థప్పడ్ వంటి సినిమాల్లో రామ్ కపూర్ నటించాడు. కారు ధర, ముఖ్యమైన ఫీచర్లు: పోర్షే 911 కరీరా ఎస్ ధర- సుమారు 1.83 కోట్లు మైలేజ్- 11.24 కిలోమీటర్/లీటర్ ఇంజన్- 2981సీసీ ఆటోమేటిక్ డ్యుయల్ క్లచ్ పెట్రోల్ వర్షన్ 4 సీటర్ కెపాసిటీ -
వైరల్: అలకబూనిన శునకం.. కారణం ఏంటి!
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రామ్ కపూర్ తరచూ వివిధ విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అతని పెంపుడు కుక్క పొపాయ్ చాలా విచారంగా ఉన్న ఓ వీడియోను "అతను పార్కుకు వెళ్లి తన ప్రేయసితో కలిసి ఉండలేకపోతున్నానని బాధపడుతున్నాడు" అనే క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పొపాయ్ ఏదో మిస్ అవుతున్నట్టు తన గడ్డాన్ని డ్రస్సర్పై ఉంచి విచారం వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాగా ఈ వీడియోను ఇప్పటివరకు 65,000 మంది నెటిజన్లు వీక్షించగా.. వందల మంది లైక్ కొట్టారు. "కుక్క తన గడ్డం ఆ డ్రస్సర్పై ఎలా ఉంచిందో...కానీ నాకు చాలా నచ్చింది, అందంగా ప్రభావవంతంగా ఉంది." అంటూ నటుడు నికి వాలియా కామెంట్ చేశారు. ఇక కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా స్పందిస్తూ.. "ఈ పేదవాడిని ఒంటరిగా వదిలేయండి" అని రాసుకొచ్చారు. కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్క నటనకి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Ram Kapoor (@iamramkapoor) (చదవండి: ఎల్లలు దాటిన ఇండో-జర్మన్ ప్రేమ కథ) -
‘నిజంగా ఇది మీరేనా.. గుర్తుపట్టలేకపోతున్నాం’
నేటి ఆధునిక జీవనశైలిలో దాదాపుగా ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. అధిక బరువును తగ్గించుకునేందుకు ఒక్కొక్కరూ గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు విశ్వప్రయత్నాలు చేసి.. స్లిమ్‌గా తయారవుతారు. టీవీ నటుడు రామ్ కపూర్ కూడా ఈ కోవకు చెందిన వారే. స్క్రీన్‌పై భారీకాయంతో కనిపించే రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చాలా కాలం తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను పలకరించిన రామ్ కపూర్... స్లిమ్‌గా ఉన్న తన ఫొటోను షేర్ చేసి అభిమానులకు స్వీట్ షాకిచ్చాడు. ఈ క్రమంలో రామ్ న్యూలుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ ఇంతలా మారిపోయారేంటి సార్. అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. ఏమాటకి ఆ మాటే గానీ... నిజానికి మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు. అయితే అందంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఇలాంటి గొప్ప మార్పుతో ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయగలరు’ అంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది మాత్రం..‘ ఇది నిజమా. మొత్తంగా మారిపోయారే. అసలు ఈ అకౌంట్ ఎవరిదో ముందు చెక్చేయాలి’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా పలు హిట్ సీరియళ్లలో నటించిన రామ్ కపూర్ కార్తిక్ కాలింగ్ కార్తిక్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, లవ్యాత్రి, షాదీ కీ సైడ్ ఎఫెక్ట్ప్ వంటి బాలీవుడ్ సినిమాల్లో కనిపించాడు. View this post on Instagram Wassssup peeps!! Long time no see A post shared by Ram Kapoor (@iamramkapoor) on Jul 7, 2019 at 12:08am PDT -
ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా..
ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీలీయోన్తో కలిసి పనిచేయడం తనకు చాలా హాయిగా ఉందని అంటున్నాడు రామ్ కపూర్. ఇప్పటికే ఆమెతో కలిసి కుచ్ కుచ్ లోచా హాయ్ అనే చిత్రంలో నటించిన ఆయన ఆ అనుభవం మరిచిపోలేనిదని, ఆరోజులు ఎంతో హాయిగా గడిపోయాయని చెప్తున్నాడు. తాను మరోసారి ఆమెతో జత కట్టబోతున్నానని, ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సన్నీతో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. ' అది నిజంగా చెప్పలేని ఆనందం. మా మొదటి చిత్రానికి చాలా గొప్పగా కలిసి పనిచేశాం. సన్నీ చాలా కష్టపడి పనిచేస్తుంది. బాగా ఫన్నీ.. ప్రొఫెషనల్ కూడా.. త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి నటిస్తున్నాను. అయితే, కామెడీ చిత్రం కాదు. 2015 చివరికి ఆ చిత్రం పూర్తవుతుంది' అని ఆయన చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement