-
విమర్శల వలలో ప్రియ
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆర్యోక్తి. అయితే నటి ప్రియాఆనంద్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా రెండు హిట్లు రావడంతో వాటిని తలకెక్కించుకున్నట్లు ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం నటుడు విమల్ సరసన ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ వ్యయం ముందుగా అనుకున్న దాని కంటే కోటిన్నర వరకు పెరిగి పోయిందట. ఇందుకు కారణం నటి ప్రియా ఆనందేనని అంటున్నారు. నిర్మాతల వద్ద ఆమె బాగా ఖర్చు పెట్టించిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అలంకరణ సామగ్రి కోసం ప్రియా ఆనంద్ అధికంగా ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ టాక్. మరో విషయం ఏమిటంటే ప్రియా ఆనంద్ తమిళ సంస్కృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నట్లు ఆమె అభిమానులే ఆగ్రహిస్తున్నారు. పియా ఆనంద్ ఇంతకు ముందు చేసిన అరిమా నంబి చిత్రంలో మద్యంలో మునిగి తేలేలా నటించడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి ప్రియా ఆనంద్ ఘాటుగానే స్పందించారు. ఆడ - మగ సమానం అంటున్న ఈ రోజుల్లో మగవారు మద్యం సేవించగా లేనిది ఆడవారు సేవిస్తే తప్పా! మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ లా తీస్తుండడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు. ప్రియా ఆనంద్ ప్రవర్తన మార్చుకోకపోతే సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు. -
ఇమాన్ బుగ్గ గిల్లిన ప్రియా
సాధారణంగా హీరోయిన్లకు ముద్దొస్తే హీరోలను చుంబిస్తుంటారు. అలా స్వకార్యం, స్వామికార్యం నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే నటి ప్రియా ఆనంద్ మాత్రం యువ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలపై ముచ్చటపడి తెగ గిల్లేసింది. నిర్మాత శాసన సభ్యుడు మైఖేల్ రాయప్పన్ తన ఇన్ఫోటెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం ఒరు ఊరుల రెండు రాజా. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్య పాత్రను సూర్య పోషిస్తున్నారు. అతిథి పాత్రలో నటి విశాఖ సింగ్, ఐటమ్ సాంగ్‌లో నటి ఇనియా దుమ్ము రేపిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్.కన్నన్ నిర్వహిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను ఈ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు కే.ఆర్., నటుడు శివకార్తికేయన్లు ఆవిష్కరించగా తొలి ప్రతిని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర అతిథులందరూ అందుకున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ ప్రియా ఆనంద్ సంగీత దర్శకుడు డి.ఇమాన్ బుగ్గలు గిల్లాలనే తన చిరకాల ఆశను ఈ వేదికపై తీర్చుకున్నారు. జాంగ్రీలా ఉన్నాయంటూ ఆయన బుగ్గల్ని తెగ గిల్లేసి ముద్దులు పెట్టుకోవడంతో ఆహూతులందరి దృష్టి వీరిపైనే పడింది. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్, విజయ్ సేతుపతి, విష్ణు, గౌతమ్‌కార్తిక్, నటి ఇనియా, విశాఖ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటమ్ సాంగ్‌తో గౌరవమే
అవకాశాలు లేక హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌కు సిద్ధం అవుతున్నారన్నది పాత మాట. అధిక పారితోషికం ఆశతో టాప్ హీరోయిన్లు కూడా అలాంటి శృంగార నృత్యాలకు సై అంటున్నారన్నది నేటి మాట. అయితే ఇనియా లాంటి అసలు విజయాలు, అంతగా అవకాశాలు లేని హీరోయిన్లు కూడా ఐటమ్స్ ఆడేస్తూ పైగా హీరోయిన్గా అవకాశాలు లేక కాదు ఆ గీతాలు నచ్చడం వల్లే అంటే వినేవారు నమ్మేస్తారా? వాగైచూడవా వంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఇనియా ప్రస్తుతం ఐటమ్ గర్ల్‌గా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని ఆడేస్తోంది. దీని గురించి ఈ అమ్ముడు వివరిస్తూ ప్రస్తుతం శరత్ కుమార్ సరసన వేళచ్చేరి చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నానని తెలిపింది. తమిళంలో గ్యాప్ రాకూడదని ఇటీవల మూడు చిత్రాల్లో సింగిల్ సాంగ్స్ చేశానని చెప్పింది. రెండవదు పడం చిత్రంలో వెంకట్ ప్రభుతో స్పెషల్‌సాంగ్‌కు ఆడానని తెలిపింది. ఇందులో పాత కథానాయికల గెటప్‌లో నర్తించానని వివరించింది. ఇక పార్తిబన్ దర్శకత్వం వహించిన కథై తిరైకథై, వచనం ఇయక్కం చిత్రంలో ఆయన అడగడంతో పలువురు ప్రముఖ నటీనటుల అతిథి పాత్రలు పోషించిన ఈ చిత్రంలో తానూ భాగం కావాలని భావించి సింగిల్ పాటలో నటించానని తెలిపింది. మూడో చిత్రం ఒరు ఊరుల రెండు రాజా దర్శకుడు కన్నన్ కోరిక మేరకు పాట కూడా నచ్చడంతో ఐటమ్ సాంగ్ చేశానని చెప్పింది. అందుకని హీరోయిన్ అవకాశాలు లేక ఐటమ్ సాంగ్స్ ఒప్పుకుంటున్నట్లు భావించరాదని, అయినా అలాంటి పాటలతోను తన గౌరవం పెరుగుతోందని ఇనియ సెలవిచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఉపశమనం
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్‌లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement