-
వాకాటి నారాయణరెడ్డి వాకింట్లో సీబీఐ దాడులు
-
టీడీపీ ఎమ్మెల్సీ ఇంటిపై సీబీఐ దాడులు
శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటలదాకా కొనసాగిన సోదాలు.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి నివాసంపై సీబీఐ అధికారుల బృందం దాడులు జరిపింది. శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు వేదాయపాలెంలోని వాకాటి ఇంటికి చేరుకున్న ఈ బృందం అప్పటినుంచి రాత్రి 9 గంటల వరకు సోదాలు నిర్వహించింది. బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబం ధించి సీబీఐ ఈ దాడులు జరిపింది. ఈ సందర్భంగా పలు పత్రాలను స్వాధీనం చేసు కుంది. 99 అగ్రిమెంట్ దస్తావేజులు ఇందులో ఉన్నట్టు సమాచారం. సోదాల నేపథ్యంలో సీబీఐ అధికారుల బృందం వాకాటిని ప్రశ్నిం చింది.మరోవైపు వాకాటికి చెందిన హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ ఇన్ఫ్రా కార్యాలయంలోనూ సీబీఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. నెల్లూరులోని వాకాటి నివాసంలో రాత్రి 9 గంటలకు సోదాలు ముగిశాయి. ఈ దాడులపై వివరణ కోరేందుకు మీడియా ప్రయత్నించగా.. వివరాలు చెప్పేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. వ్యాపారాల్లో సహజమే..:వాకాటి సీబీఐ దాడుల అనంతరం వాకాటి విలేకరుల తో మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలు, బ్యాంకు అగ్రిమెంట్లకు సంబంధించిన విచార ణ నిమిత్తం సీబీఐ అధికారులు వచ్చారని తెలిపారు. అనేక అంశాలపై తన నుంచి వివరణ తీసుకున్నారని చెప్పారు. వ్యాపారాల్లో ఇదంతా సహజమేనని, దానిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన ముక్తాయించారు. పూర్వాపరాలివీ..: వీఎన్ఆర్ ఇన్ఫ్రా, పవర్‌టెక్ లాజిస్టిక్స్ సంస్థల పేరుతో నారా యణరెడ్డి నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. 2014లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీ న్ బ్యాంకుల నుంచి ఆయన రూ.443.27 కోట్ల మేర రుణాలు తీసుకు న్నారు. బకాయి పడిన మొత్తం వడ్డీతో సహా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ఇటీవల బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి.దీంతో వాకాటిపైన చీటింగ్‌తో పాటు పలు కేసులు నమోదయ్యా యి. మరో వైపు నకిలీ డాక్యుమెంట్లతో వాకాటి తమ నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకు న్నారని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement