-
రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్?
కోలీవుడ్‌లో ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదే సూపర్‌స్టార్ రజనీకాంత్, అద్భుత చిత్రాల దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక బ్రహ్మాండ చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నదే ఆ ప్రచారం. టాలీవుడ్లో జక్కన్నగా పిలవబడే రాజమౌళి వెండితెరపై చెక్కిన చిత్రాలన్నీ సంచలన విజయాలుగానే నమోదయ్యాయి. ఆయన దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం ప్రపంచ సినిమానే తిరిగి చూసేలా చేసింది. అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. ఇక మన సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల నటించిన కబాలి కోలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను సాధించిన చిత్రంగా నమోదైంది.అలాంటి రజనీకాంత్ బాహుబలి చిత్రం చూసి దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు ఆయన దర్శకత్వంలో నటించాలనే ఆసక్తిని కనబరచారు. అందుకు ఇప్పుడు పునాది పడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రాజమౌళి చిత్రాలన్నిటికీ ప్రముఖ రచయిత విజయేంద్రప్రసానే కథకుడు. ఆయన సాంఘిక, చారిత్రక, పౌరాణిక కథలను అందించడంలో దిట్ట. ఆయన ఇప్పుడు మహాభారత ఇతిహాసాన్ని తీసుకుని ఒక అద్భుత కథను సిద్ధం చేస్తున్నారట.అందులో ఒక పాత్రకు రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రజనీకి పౌరాణిక ఇతిహాసాలంటే చాలా ఇష్టం. అలాంటి చిత్రంలో నటించాలన్న ఆసక్తి మెండుగా ఉంది. ఆ కోరికను ఈ చిత్రం ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడు రాజమౌళి తదుపరి చిత్రం ఇదేననే ప్రచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఆయన బాహుబలి–2 చిత్రాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మించనున్న కబాలి–2 చిత్రంలో నటించనున్నారు. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్వర్గాల టాక్. -
సూపర్‌స్టార్ కబాలి-2 చేస్తారా?
తమిళసినిమా; కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. వసూళ్ల జోరు తగ్గలేదు. దటీజ్ సూపర్‌స్టార్ స్టామినా అనక తప్పదు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం విడుదలకు ముందు ఆ తరువాత కూడా ఒక సంచలనం. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చిన కబాలి సూపర్‌స్టార్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నం అని చెప్పక తప్పదు. ఎందుకం టే ఇందులో రజనీకాంత్ తరహా స్టైల్ కనిపిం చదు. పంచ్‌డైలాగ్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే రజనీ తరహా నటనను చూడలేం. ఆయన హావభావాల నుంచి అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఆ క్రెడిట్ మాత్రం దర్శకు డు రంజిత్‌దే అని చెప్పక తప్పదు. అయితే కబాలి చిత్రం అందర్నీ అలరిస్తోందని చెప్పలేం. కొందరు ఆహా ఓహో అంటున్నారు. మరి కొందరు ఓకే అంటున్నారు. ఇంకొందరు పెదవి విరుస్తున్నారు. నటి లక్ష్మీరామకృష్ణన్ వంటి వారు రజనీకాంత్ చిత్రాన్ని ఇంకా ఎక్కువ ఊహించామని అంటున్నారు. ఇలా కబాలి చిత్రంపై ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. కబాలి-2లో రజనీ? కాగా కబాలి చిత్రం చూసిన వారు దీనికి పార్టు-2 వస్తుందా?అంటూ చర్చించుకుంటున్నా రు. క్లైమాక్స్‌ను దర్శకుడు ఆ విధంగా ముగింపు పలికారు. కబాలి తన పాఠశాల పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా ఆ పాఠశాలకు చెందిన ఇక విద్యార్థికి మలేషియా పోలీస్అధికారి ఒక తుపాకీ ఇచ్చి కబాలి వద్దకు పంపడం, అతను రాగానే స్క్రీన్ బ్లాక్ అవడం, ఈ తరువాత తుపాకీ పేలిన శబ్ధం రావడం చాలా సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. కాగా కబాలి చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను తాను రెడీ అన్నట్టు కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే కబాలి-2లో నటించడానికి సూపర్‌స్టార్ అంగీకరిస్తారా?అసలు ఈ చిత్రంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి? అన్న విషయాలు రజనీకాంత్ నోరు విప్పితేనే తెలుస్తుంది. అమెరికా నుంచి ఆదివారమే చెన్నైకి తిరిగొచ్చిన ఆయన కబాలి చిత్రంపై స్పందన కోసం యావత్ సినీప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి మన సూపర్‌స్టార్ అసలు కబాలి గురించి స్పందిస్తారో?లేదో? వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రోబో-2 చిత్రాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలెక్షన్లు కొల్లగొడుతున్న కబాలి అయితే రజనీకాంత్ అభిమానుల్ని మాత్రం కబాలి విపరీతంగా అలరిస్తోంది. వారు చాలా ఖుషీ అవుతున్నారు. ఇలా మిశ్రమ స్పందన వస్తున్నా దానితో నిమిత్తం లేకుండా కబాలి కలెక్షన్లలో మాత్రం బాక్సాపీస్ బద్ధలైపోతోంది. ఈ విషయంలో మాత్రం మరో మాట లేదు. ఇప్పట వరకూ భారతీయ సినీ చరిత్రలో ఏ చిత్రం సాధించని కలెక్షన్లను కబాలి సొంతం చేసుకుంటోంది. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం, హిందీ అంటూ తారతమ్యం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ బెంబేల్ ముఖ్యంగా బాలీవుడ్ చిత్రపరిశ్రమను కబాలి బెంబేలెత్తిస్తోంది. కబాలి కలెక్షన్లు అక్కడి దర్శక నిర్మాతలను కలవరపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 22,23,24 ఈ మూడు రోజు ల్లోనే ప్రీమియర్ షోలతో కలిపి కబాలి 300 కోట్లు కొల్లగొట్టిందని బాలీవుడ్ బాక్సాపీస్ వర్గాలు లెక్కలు కడుతున్నారు. కాగా ధూమ్-3 దే ఇప్పటి వరకూ బాలీవుడ్లో రికార్డట. ఆ చిత్రం తొలి వారంలో 70 కోట్లు వసూల్ చేసిందట. అయితే కబాలి ఇప్పటికే 87 కోట్లు వసూల్ చేసి ఆ రికార్డును బద్ధలు కొట్టడంతో పాటు ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచిందనే టాక్ వి నిపిస్తోంది. ఈ రికార్డును భవిష్యత్‌లో మన చి త్రాలు బ్రేక్ చేస్తాయా అన్న కలత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలకు పట్టుకుందట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement