-
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల -
ఫ్యా'షైన్'
ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్, సాఫ్ట్వేర్.. ఇలా రెగ్యులర్ చదువులు. ఆ తరువాత టెన్ టూ ఫైవ్ రొటీన్ జాబ్స్. ఆసక్తులతో ఏమాత్రం సంబంధం లేకుండా చేసే ఉద్యోగాలపై నగర యువత విముఖత చూపుతోంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా... యూనిక్‌నెస్ ఉంటే చాలు. ఈ రంగంలో దూసుకుపోవచ్చు. అందుకే చదువుతో పనిలేకుండా ఆసక్తి, సృజనాత్మకతతో ముడిపడిన ఫ్యాషన్ డిజైనింగ్వైపే యువత మక్కువ ప్రదర్శిస్తోంది. విద్యార్థుల అభిరుచులకు తగినట్టుగా విద్యాసంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. రెగ్యులర్ డిజైన్స్‌కి భిన్నంగా వేస్ట్ ప్రొడక్ట్స్‌ను వినియోగించి వండర్ఫుల్ డిజైన్స్ సృష్టిస్తున్నారు ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు. - శిరీష చల్లపల్లి హైదరాబాదీస్ ఆర్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. ఫ్యాషన్‌లో ఎప్పటికప్పుడు వస్తున్న ట్రెండ్స్‌ని అప్డే ట్ చేసుకుంటున్న నగరం ఈ రంగంలో ప్రపంచస్థాయిలో పోటీ పడుతోంది. ఆ పోటీని తట్టుకోవడానికి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలా ప్రత్యేక ఎయిమ్‌తో ప్రారంభమైందే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. డి.రవీందర్‌రెడ్డి ఈ ఫ్యాషన్ స్కూల్‌కు డెరైక్టర్. అంతకుముందు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైనింగ్ (ఐఐఎఫ్టీడీ) ఫ్రాంఛైజీగా ఉన్న ఈయన... ఫ్యాషన్ రంగంలో మరింత ముందుకు వెళ్లాలన్న లక్ష్యంతో ఐఎఫ్ఎస్ను స్థాపించారు. పురికొస, పేపర్ముక్కా... చైతన్యపురిలో ఉన్న ఈ ఫ్యాషన్ స్కూల్ విద్యార్థులు వినూతన్నమైన డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు. పురికొస, పేపర్ముక్క, షర్ట్ బటన్... కాదేదీ డిజైనింగ్ కనర్హం అంటున్నారు. పనికి రాకుండా పడి ఉన్న పాత న్యూస్‌పేపర్, షర్ట్ బటన్స్, మిగిలిపోయిన బట్టముక్కలతో ఫ్యాషన్‌కు రిక్రియేషన్ చేస్తున్నారు. క్రియేటివిటీకి చదువుతో పనిలేదు. టాలెంట్‌కు ప్రియారిటీ ఉన్న ఫ్యాషన్ రంగంలో క్రియేటివిటీతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఉన్నత చదువులు అదనపు అర్హత మాత్రమే. అందుకే ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ పట్టాలు పుచ్చుకున్నవారు సైతం ఈ ఎవర్ ఎండింగ్ఫీల్డ్పై అంతులేని ఉత్సాహం చూపుతున్నారు. విద్యార్థుల ఉత్సాహాన్ని బట్టి ఈ రంగంవైపు రావాలనుకునేవారికి స్కాలర్షిప్స్ కూడా అందిస్తోంది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్. అంతేకాదు సృజనాత్మకత ఉండి... ఆర్థిక స్థోమత లేని యువతకు ఫీజులో రాయితీ కూడా కల్పిస్తోంది. ట్రెడిషన్ మిస్‌కాకుండా... ఫ్యాషన్రంగం కలర్‌ఫుల్ ఫీల్డ్. దీన్ని ఎంచుకునేవారు సైతం డిఫరెంట్ ఐడియాస్ ఉన్నవారే ఉంటారు. ఉన్నత చదువులు చదివినవారే కాదు... టెన్త్ చదివినా ప్రపంచానికి కొత్తదనాన్ని పరిచయం చేద్దామనుకుంటే చాలు. అదే వారి అర్హత. వేరే ఫీల్డ్‌తో పోల్చుకుంటే అవకాశాలు కూడా ఎక్కువ. అమ్మాయిలు ఎక్కువగా ఈ ఫీల్డ్‌వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే మా ఇనిస్టిట్యూట్‌లో ట్రెడిషన్ మిస్ కాకుండా చూస్తున్నాం. - మోనికా, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్ ఫ్యాకల్టీ టెన్షన్ ఫ్రీ... డిగ్రీ చేశాను. టెన్ టు ఫైవ్ జాబ్స్ చేయడం నాకు నచ్చదు. అందుకే పెళ్లయినా చిన్నప్పటినుంచే ఇష్టపడిన ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నా. ఫ్యూచర్లో జాబుకు వెళ్లి వచ్చి, ఫ్యామిలీని చూసుకోలేక టెన్షన్ పడేకన్నా... హ్యాపీగా ఇంటిదగ్గరే నా సొంత కలెక్షన్‌తో బొటిక్ పెట్టుకుని సెటిలవ్వొచ్చు. - రమ్య, ఫ్యాషన్ స్టూడెంట్ ఎవర్ ఎండింగ్... ఇదొక ఇన్నోవేటివ్ ఫీల్డ్. ఈ డిజైనింగ్ ఫీల్డ్ ఎవర్ ఎండింగ్ బిజినెస్. ఒకరి మీద ఆధారపడకుండా కేవలం మన టాలెంట్‌ని బట్టి ఎదిగే బిజినెస్. అందుకే ఎన్నో ఆప్షన్స్ ఉన్నా... ఈ డిజైనింగ్ ఫీల్డ్నే ఎంచుకున్నా. - విజిత, ఫ్యాషన్ స్టూడెంట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్‌తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు నోటీసులు?
హైదరాబాద్‌పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్‌పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement