-
సంక్రాంతి వేళ.. సినిమా పోస్టర్ల కళకళ!
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడే వేరు. కొత్త ఏడాదిలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే పండగ ఇదొక్కటే. అంతలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఫెస్టివల్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లకు సంక్రాంతి పండుగ ఓవరం లాంటిదనే చెప్పాలి. అగ్ర హీరోలంతా ఈ పండుగకు సినిమాలు రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వాటి మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే మరికొందరు హీరోలు ఈ ఫెస్టివల్‌కే అప్డేట్స్ సిద్ధమయ్యారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా సినిమా హీరోలంతా క్రేజీ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మెగాస్టార్, ప్రభాస్, సూర్య, విజయ్, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు తమ మూవీ పోస్టర్స్‌తో అలరించారు. అంతే కాకుండా అలా ఈ ఏడాది పొంగల్‌కు మన ముందుకు వచ్చిన కొత్త సినిమాల పోస్టర్స్‌పై ఓ లుక్కేద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం టైటిల్‌ను సంక్రాంతి రోజే మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్- మారుతి డైరెక్షన్లో మూవీ టైటిల్‌ను వెల్లడించారు మేకర్స్. ది రాజాసాబ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ వచ్చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ వీడియోను విడుదల చేశారు. వీటితో పాటు శర్వానంద.. శతమానంభవతి పార్ట్-2 రానుందని పోస్టర్ విడుదలైంది. మరోవైపు కోలీవుడ్ స్టార్స్ విజయ్, సూర్య సినిమాలకు సంబంధింటిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా మీ అభిమాను హీరోల చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ చూసేయండి. அனைவருக்கும் இனிய பொங்கல் நல்வாழ்த்துகள் 😇☀️🌾#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4 @ritika_offl @officialdushara @srkathiir @philoedit @KKadhirr_artdir… pic.twitter.com/bbuCtkAgLG — Lyca Productions (@LycaProductions) January 15, 2024 The Art behind the aesthetic! 🎨✨ Delve into the making of the vibrant & colourful VETTAIYAN 🕶️ poster! ✨ Art by 🖌️ @sthabathy Designed by 🖼️ @gopiprasannaa Photographed by 📸 @anand16na#VETTAIYAN 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions… pic.twitter.com/wQiW2hiaZ1 — Lyca Productions (@LycaProductions) January 15, 2024 pic.twitter.com/Tl8mrlT8fT — Vijay (@actorvijay) January 15, 2024 Echoes of freedom in every note. 🇮🇳 #OperationValentine All set to launch our first song at the iconic Wagah border, Amritsar 💥#VandeMataram song launch on Jan 17th 🎶#HappySankranti ✨ pic.twitter.com/5CkfhnZykN — Varun Tej Konidela (@IAmVarunTej) January 15, 2024 For he was touched by fire, chosen as a beacon of hope🔥 Unveiling the #Kanguva2ndLook tomorrow at 11 AM⚔️#Kanguva🦅⚔️ #HappyPongal🌾 #HappyMakarSankranti🌞@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions #Vamsi… pic.twitter.com/pzW6yWR5pw — UV Creations (@UV_Creations) January 15, 2024 7 years ago, #ShathamanamBhavathi Celebrated Sankranthi with its timeless magic ❤️ Now, get ready for another chapter unfolding with even more enchantment in 2025! 😍 More Details loading soon 😉 వచ్చే సంక్రాంతికి కలుద్దాం ❤️🔥 pic.twitter.com/yJT5xump4Q — Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2024 Igniting the MASS MODE 🥁🕺 Presenting the delightful #TheRajaSaab Title Announcement 🤩 - https://t.co/IhcaisVZsy 𝐀 𝐑𝐞𝐛𝐞𝐥’𝐬 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 𝐄𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐒𝐨𝐨𝐧 🌋#PrabhasPongalFeast #Prabhas A @DirectorMaruthi film Produced by… — People Media Factory (@peoplemediafcy) January 15, 2024 The celestial bodies are making way for the MEGA MASS BEYOND UNIVERSE 🔥 #Mega156 title today at 5 PM 💫🌠 MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @boselyricist @NaiduChota @mayukhadithya @sreevibes @gavireddy_srinu @AforAnilkumar @UV_Creations pic.twitter.com/bsyqxtE6Hk — UV Creations (@UV_Creations) January 15, 2024 -
యుగల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మెగా అభిమాని జీఎస్ఎన్ నాయుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం యుగల్. ది మాన్ విత్ డైవర్సన్ అనేదే ట్యాగ్ లైన్. ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మి గణ సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. హీరో జీఎస్ఎన్ నాయుడు మాట్లాడుతూ.. 'మొదట ఈ చిత్రానికి గన్ని అనే టైటిల్ అనుకున్నాం. కానీ తర్వాత యుగల్ పేరు ఖరారు చేశాం. మేము ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.' అని తెలిపారు. దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ..' ఈరోజు యుగల్ మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో మెగా పవర్ స్టార్ వీరాభిమాని. అందుకే మా చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం పవన్ కల్యాణ్ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. కథ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మీ అందరికి సినిమా బాగా నచ్చుతుంది" అని అన్నారు. -
ఆసక్తిగా కల్యాణ్ రామ్ మూవీ టైటిల్.. సోషల్ మీడియాలో వైరల్
బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. (చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!) రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్‌లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కల్యాణ్ రామ్‌లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్‌లో ఉన్నారు. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
గ్రామీణ ప్రేమకథాంశంగా వస్తున్న 'ఉమాపతి'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఉమాపతి'. గ్రామీణ నేపథ్యం ఆధారంగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కె.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శక్తికాంత్ కార్తిక్ సంగీతమందిస్తున్నారు. ప్రేమకథను ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్దపీట వేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలవాని' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు. (చదవండి: అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్గ్రీన్ బ్యూటీ చెప్పిన రేఖ చిట్కాలివే!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్లలో భాగంగా దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. పచ్చని పంట పొలాల్లో గ్రామీణ వాతావరణంలో ఒకరినొకరు చూసుకుంటున్న పోస్టర్ చూస్తే కచ్చితంగా ప్రేమకథే ప్రధాన అంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. లవ్ స్టోరీతో పాటు కామెడీ సీన్స్ జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ప్రధాన పాత్రలు పోషించారు. -
మంచి కాన్సెప్ట్ అనిపిస్తోంది
సిద్ స్వరూప్, కార్తికేయ రెడ్డి, ఇందు ప్రియ ప్రధాన పాత్రల్లో సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘దోస్తాన్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలక్ట్ చేసుకుని చిత్ర యూనిట్ సినిమా తీశారని అనిపిస్తోంది. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాత సూర్యనారాయణకు పెద్ద హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సూర్యనారాయణ. ‘‘మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ ఇచ్చిన సూర్యనారాయణ అక్కమ్మగారికి థ్యాంక్స్’’ అన్నారు సిద్ స్వరూప్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్‌పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement