-
దువ్వెనలా ఉండే ఈ డివైజ్ మీ వద్ద ఉంటే..అందం మీ సొంతం!
చిత్రంలోని పరికరం చూసి.. కేవలం దువ్వెన అనుకోవడంలో తప్పు లేదు కానీ ఇది మల్టీ డివైస్. తలకు మాత్రమే కాదు.. ముఖానికి, మొత్తం చర్మానికీ ఉపయోగపడుతుంది. జుట్టును, బాడీని అందంగా తీర్చిదిద్దుతుంది. ఈ మల్టీ–అటాచ్మెంట్ ఫేస్ స్కాల్ప్ కేర్ డివైస్.. ఎల్ఈడీ లైటింగ్‌తో, ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీతో, వైబ్రేషన్ తో పని చేస్తుంది. అయితే దీనికి ఉన్న మూడు వేరు వేరు హెడ్స్‌ని అవసరాన్ని బట్టి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఇది చర్మాన్ని ముడతలు, మచ్చలు లేకుండా మృదువుగా మారుస్తుంది. యవ్వనం తిరిగి వస్తుంది. అలాగే తలకు మసాజ్లానూ.. వెంట్రుకల గ్రోత్‌ని పెంచే విధంగానూ ఇది ట్రీట్మెంట్ని అందిస్తుంది. కండరాలను ఉత్తేజపరచేందుకు.. చిన్న చిన్న నొప్పులు తగ్గించుకునేందుకు మల్టీ హెడ్ (బాల్స్ అటాచై ఉన్న భాగం)ను ఈజీగా డివైస్‌కి అమర్చుకుంటే సరిపోతుంది. ఈ బ్యూటీ టూల్లో.. ‘లో/మీడియం/ హై’ ఆప్షన్స్‌తో పాటు.. స్కాల్ప్, ఫేస్, మల్టీ అనే మూడు హెడ్స్‌ని అవసరానికి మార్చుకునే వీలుండటంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. 3 గంటల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ధర 911 డాలర్లు. అంటే రూ. 75,005లు. క్వాలిటీ, రివ్యూస్ ఆధారంగానే ఇలాంటి డివైస్‌లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!) -
జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా? ఇకపై నో టెన్షన్
జుట్టు రాలిపోవడం.. నిర్జీవంగా మారిపోవడం.. ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్యారమే ఈ ఎల్ఈడీ హెయిర్ గ్రోత్ థెరపీ కోంబ్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అలాగే తలకు రిలాక్సింగ్ మసాజర్లానూ పని చేస్తుంది. 3 రకాల వైబ్రేషన్ మసాజ్ ఆప్షన్స్‌తో ఇది రూపొందింది. ఈ ఎల్ఈడీ లైట్లు రెడ్ అండ్ బ్లూ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్.. జుట్టు దృఢత్వానికి, పెరుగుదలకు ఉపయోగపడితే.. బ్లూ కలర్ .. స్కాల్ప్ ఇరిటేషన్, ఆయిల్ కంట్రోల్ వంటివి సరిచేస్తుంది. దీనిలోని 49 హెడ్ మసాజ్ బ్రిసల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచే చికిత్సను అందిస్తుంటాయి. మసాజ్‌ని ప్రారంభించడానికి ఎమ్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. లైట్ మోడ్‌ని ఆన్ చేయడానికి లైట్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి. అవసరమైన కలర్ ఎంపికతో నచ్చే మసాజ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఈ డివైస్‌ను అచ్చం సాధారణ దువ్వెనలా ఉపయోగించుకోవచ్చు. మెడ, చెవి వెనుకవైపు నుంచి జుట్టును దువ్వుకున్నప్పుడు ఈ మసాజర్‌తో మంచి ఫలితాలుంటాయి. దీన్ని స్త్రీ, పురుషులు ఇరువురూ వాడుకోవచ్చు. అన్ని రకాల ఆయిల్స్ అప్లై చేసుకుని కూడా ఈ మసాజర్‌ను వినియోగించుకోవచ్చు.ఈ ఎల్ఈడీ దువ్వెన.. పోర్టబుల్ అండ్ లైట్ వెయిట్. చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గానూ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేయడానికి కాటన్ లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించాలి. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కావడంతో.. ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర సుమారుగా రెండువేల రూపాయలు. -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
జుట్టును ఎంత దువ్వినా మాట వినదు.. ఈ వ్యాధికి చికిత్స ఉందా?
ఫొటో చూడండి. పిల్లాడి జుట్టు గమ్మత్తుగా ఉంది కదా. ఏ హెయిర్ స్టైలిస్టో కానీ భలే పనిమంతుడు.. బాగా సెట్ చేశాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇది మనుషులు సెట్ చేస్తే వచ్చేది కాదు. వెంట్రుకలకు వచ్చే వ్యాధి వల్ల జుట్టు ఇలా తయారైంది. దీన్ని అన్ కోంబబుల్ హెయిర్ సిండ్రోమ్ (యూహెచ్ఎస్) అంటారు. జన్యుప రమైన సమస్యలతో ఇలాంటి సమస్య వస్తుంటుంది. ప్రతి పది లక్షల మందిలో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా 3–12 ఏళ్ల చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ల జుట్టును ఎంత దువ్వినా చెప్పిన మాట వినదు. పొలుసులుగా నిటారుగా నిలబడి ఉంటుంది. మెల్లమెల్లగా రాలిపోతుంటుంది. ఇలాంటి వాళ్ల జుట్టులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. మామూలు మనుషుల వెంట్రుకల మొనలు స్థూపాకారంలో ఉంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ల వెంట్రుకలు త్రిభుజాకారంలో మారిపోతాయి. చదవండి👉ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా.. అందుకే దువ్వెనతో కూడా దువ్వలేనంతగా వింతగా, అడ్డదిడ్డంగా పెరుగుతాయి. జన్యుపరమైన మార్పు వల్ల కొందరిలో చర్మం, పళ్లు, గోర్లకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ వ్యాధికి చికిత్స అంటూ ఏం లేదు. అయితే కొందరు పిల్లల్లో బయోటిన్ వాడటం వల్ల కొంత మార్పు కనిపిస్తోందని.. మరికొందరిలో వయసు పెరుగుతున్నాకొద్దీ సమస్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ట్విస్ట్...
సిగ సింగారం ఇది ట్విస్ట్ హెయిర్ స్టయిల్. దీన్ని యువత పార్టీలకు వేసుకోవడానికి బాగా ఇష్టపడుతుంది. ఇది లాంగ్ స్కర్ట్స్, గాగ్రా, గౌన్ల మీదకే కాదు... చీరల మీదకు కూడా బాగా నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండనక్కర్లేదు. ఓ మాదిరిగా ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఈ ట్విస్ట్ హెయిర్ స్టయిల్‌ను మీరూ వెంటనే ట్రై చేయొచ్చు. 1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత కుడిచెవి వైపు నుంచి పాపిట తీయాలి. ఆపైన ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు పాయలను తీసుకొని వేళ్లతో పట్టుకోవాలి. 2. తర్వాత ఒక్కో పాయను మెలితిప్పి, రెండు పాయలనూ కలిపి మళ్లీ ట్విస్ట్ చేసుకోవాలి. ముందు కొన్ని వెంట్రుకలను అలాగే లూజ్‌గా వదిలేస్తే.. అందంగా ఉంటుంది. 3. ఇప్పుడు పక్క నుంచి మరో పాయను తీసి, పైన తిప్పుకున్న పాయలతో కలిపి ట్విస్ట్ చేసుకోవాలి. 4. పై విధంగా ఒక్కో పాయను తీసుకుంటూ (ఫ్రెంచ్ స్టయిల్లా) పై పాయతో కలిపి మెలితిప్పుకుంటూ పోవాలి. 5. అలా జుత్తును మెడ వరకూ మెలితిప్పుకున్నాక, ఇప్పుడు ఎడమ చెవి వైపున నుదుటి దగ్గర కొంత జుత్తును తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని, ముందుగా ట్విస్ట్ చేసుకున్న జడను ఒకచోటికి చేర్చాలి. 6. ఇప్పుడు పైన చెప్పిన రెండింటినీ కలిపి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. 7. బ్యాండ్ కిందున్న పోనీని దువ్వెనతో రివర్స్‌లో దువ్వుకోవాలి (అంటే కింది నుంచి పైకి), అలా చేస్తే జుత్తంతా పఫ్ఫీగా మారుతుంది. 8. తర్వాత ఆ పఫ్ఫీ జుత్తును ట్విస్ట్ చేయాలి. 9. ఆ మెలితిప్పిన జుత్తును ఎడమ చెవి వైపున కొప్పుగా చుట్టుకోవాలి. కొప్పు టైట్‌గా ఉండటానికి స్లైడ్స్ ఉపయోగించాలి. 10. చివరగా హెయిర్ స్ప్రే చేసుకుంటే.. మీ హెయిర్ స్టయిల్ అందంగా మారుతుంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్‌పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement