ట్విస్ట్...

ట్విస్ట్... - Sakshi


సిగ సింగారం

ఇది ట్విస్ట్ హెయిర్ స్టయిల్. దీన్ని యువత పార్టీలకు వేసుకోవడానికి బాగా ఇష్టపడుతుంది. ఇది లాంగ్ స్కర్ట్స్, గాగ్రా, గౌన్ల మీదకే కాదు... చీరల మీదకు కూడా బాగా నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండనక్కర్లేదు. ఓ మాదిరిగా ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఈ ట్విస్ట్ హెయిర్ స్టయిల్‌ను మీరూ వెంటనే ట్రై చేయొచ్చు.

 

1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత కుడిచెవి వైపు నుంచి పాపిట తీయాలి. ఆపైన ఫొటోలో కనిపిస్తున్న విధంగా రెండు పాయలను తీసుకొని వేళ్లతో పట్టుకోవాలి.

 

2. తర్వాత ఒక్కో పాయను మెలితిప్పి, రెండు పాయలనూ కలిపి మళ్లీ ట్విస్ట్ చేసుకోవాలి. ముందు కొన్ని వెంట్రుకలను అలాగే లూజ్‌గా వదిలేస్తే.. అందంగా ఉంటుంది.

 

3. ఇప్పుడు పక్క నుంచి మరో పాయను తీసి, పైన తిప్పుకున్న పాయలతో కలిపి ట్విస్ట్ చేసుకోవాలి.

 

4. పై విధంగా ఒక్కో పాయను తీసుకుంటూ (ఫ్రెంచ్ స్టయిల్‌లా) పై పాయతో కలిపి మెలితిప్పుకుంటూ పోవాలి.

 

5. అలా జుత్తును మెడ వరకూ మెలితిప్పుకున్నాక, ఇప్పుడు ఎడమ చెవి వైపున నుదుటి దగ్గర కొంత జుత్తును తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని, ముందుగా ట్విస్ట్ చేసుకున్న జడను ఒకచోటికి చేర్చాలి.

 

6. ఇప్పుడు పైన చెప్పిన రెండింటినీ కలిపి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి.

 

7. బ్యాండ్ కిందున్న పోనీని దువ్వెనతో రివర్స్‌లో దువ్వుకోవాలి (అంటే కింది నుంచి పైకి), అలా చేస్తే జుత్తంతా పఫ్ఫీగా మారుతుంది.

 

8. తర్వాత ఆ పఫ్ఫీ జుత్తును ట్విస్ట్ చేయాలి.

 

9. ఆ మెలితిప్పిన జుత్తును ఎడమ చెవి వైపున కొప్పుగా చుట్టుకోవాలి. కొప్పు టైట్‌గా ఉండటానికి స్లైడ్స్ ఉపయోగించాలి.

 

10. చివరగా హెయిర్ స్ప్రే చేసుకుంటే.. మీ హెయిర్ స్టయిల్ అందంగా మారుతుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top