-
మంచు కురిసే వేళలో.... వణికే పెదవులు పలికే పాటలు విన్నారా?
Best Telugu Romantic Songs: చలి మొదలైంది. మంచు రాలడం మొదలవుతుంది. వణికే పెదవుల మీద పాటలు కూడా వస్తుంటాయి. చలిగాలిని, మంచు కురిసే వేళని సినీ కవులు సుందరంగా తీర్చిదిద్దారు. నాయికా నాయికులను తమ పదాలతో దగ్గరకు చేర్చారు. నేడు ఆదివారం. ఈ చలికాలపు ఉదయం ఈ పాటలు నెగళ్లుగా మారతాయేమో చూడండి. వింటే భారతం వినాలి అంటారు కానీ అది మాత్రమే కాదు. సాలూరి వారి పాట కూడా వినాలి. ‘చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి’... బహుశా అది చలికాలపు చలి కావచ్చు. ఆపై బరువుగా యమున ప్రవహిస్తుండవచ్చు. ఆ సమయాన శ్యామసుందరుడు మురళి ఊదితే వేరే ఏ వ్యాపకమూ పెట్టుకోబుద్ధి కాని ఆ వేళ అది మధురము. మరెంత వెచ్చదనమూ. ‘చలిచలిగా గిలి పుడుతుంటే’ అన్నాడు ఆత్రేయ. అఫ్కోర్స్. వానకు తడిసిన బి.సరోజాదేవిని చూసిన నాగేశ్వరరావు చేతే అనుకోండి. కాని ఇప్పుడు చలికాలంలో వానలు పడుతున్నాయి. వరదలూ వస్తున్నాయి. చలిజల్లును ఎదుర్కొనడానికి ఒకరి పక్కన ఒకరు ఒదిగి కూచోక తప్పదు. ఈ ఆత్రేయే ‘సోగ్గాడు’లో ‘చలివేస్తుంది చంపేస్తుంది’ అని రాశాడు. కాని ఒక కవిగా స్పందించి ‘మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’... అంటే ఎంత బాగుంది. నిజానికి మల్లెలది వేసవి కాలం. మంచుతో తడిసే మల్లెను చూడటం కవికి రసాస్వాదన. అబ్బాయికీ అమ్మాయికీ హొయలు. పొగమంచులో పాట తీయడం అప్పట్లో కొత్త. తమిళం వాళ్లు చూపించారు. ‘పరువమా... చిలిపి పరుగు తీయకు’... జాగింగ్ చేస్తున్న సుహాసిని, మోహన్‌ను తెలుగు తెర మీద కొత్తగా చూశారు. బాపు గారు అదే పొగమంచును ‘ఏమని నే చెలి పాడుదును’లో అద్బుతంగా చూపారు. జంధ్యాల ‘రాగలీల’లో ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ పాటను రెహెమాన్, సుమలత మీద గొప్ప మంచులో చిత్రీకరిస్తారు. ‘మూడుముళ్లు’లో ఆయనే తీసిన ‘లేత చలిగాలులూ దోచుకోరాదురా’ పాట మిట్టమధ్యాహ్నం విన్నా మంచు తాకేలా ఉంటుంది. ‘సొమ్మొకడిది సోకొకడిది’లో ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని రాశాడు వేటూరి. ‘మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్లిపోయే’ అని ‘నిరంతరమూ వసంతములే’ పాటలో ఆయన మాత్రమే అనగలడు. చలికి ఒణికే హీరోయిన్‌కు హీరో ఉదారంగా తన కోటు తీసివ్వడం కద్దు. ‘క్షణక్షణం’లో ఆ జాక్‌పాట్ వెంకటేశ్‌కు దక్కింది వెంకటేశ్. మరి అతడు జీన్స్ జాకెట్ ఇచ్చింది శ్రీదేవికి కదా. చలికి చాలామంది ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. కాని ‘జామురాతిరి’ పాటలో శ్రీదేవి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూడాలి. సావిత్రి మహానటి. శ్రీదేవి.. మహూహూ.. నటి. చలిని కొత్త సినిమాలు కూడా వదలుకోలేదు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ‘చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది మనసు’ పెద్ద హిట్. ప్రభాస్‌కు, కాజల్‌కు అదొక సుకుమారమైన చలిగీతం. నానికి కూడా ఇలాంటి హిట్ ఉంది. సిరివెన్నెల రాశాడు– జెంటిల్మెన్ కోసం. ‘చలిగాలి చూద్దు తెగ తుంటరి... గిలిగింత పెడుతున్నది’ అని ఒక పంక్తి ఉంటే తర్వాతి పంక్తి ‘పొగమంచు చూద్దు మహ మంచిది.... తెరచాటు కడుతున్నది’ అని ఉంటుంది. ఆ ప్రేయసీ ప్రియుల ఏకాంతానికి పొగ మంచు తెరచాటు కడుతున్నదట. ఎంత బాగుంది. రుతువులు వచ్చేది మార్పు ఉండాలి జీవితంలో అని చెప్పడానికి. ప్రకృతే మారి మారి ఆనందిస్తుంటే మనిషే రోజువారి రొడ్డకొట్టుడులో పడి ఆస్వాదనకు దూరమవుతున్నాడు. చీకటితో లేవండి. చలిని ఎంజాయ్ చేయండి. మంచులో తడిసినపూలను చూడండి. నెగళ్ల సెగను అనుభవించండి. ఆ సమయంలో టీ తాగడం మర్చిపోవద్దు. -
ఇది... త్రిష ప్రేమ పురాణం..!
‘‘ప్రేమ లేదనీ....ప్రేమించరాదనీ ’’ అని మహాకవి ఆత్రేయ ‘అభినందన’ చిత్రంలో ప్రేమ గురించి తనదైన శైలిలో రాశారు. మళ్లీ అదే సినిమాలో ‘‘ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం’’ అన్నారు. ఇలా ప్రేమ గురించి మంచీ, చెడూ ఏది చెప్పినా వినడానికి మాత్రం హాయిగా ఉంటుంది. ప్రేమకు ఉన్న మహత్తు అలాంటిది. అసలు ఈ ప్రపంచంలో ప్రేమ గురించి మాట్లాడనివాళ్లు ఎవరూ ఉండరేమో! ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తారు. పెళ్లిలో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న త్రిష మాత్రం... ‘ప్రేమ చాలా మధురం’ అంటారు. ప్రేమ గురించి ట్విట్టర్లో త్రిష స్పందిస్తూ -‘‘ప్రేమలో అసూయ, ద్వేషం, విషాదం, ఒంటరితనం, ఎడబాటు, సంతోషం - అన్నీ ఉంటాయి. ఈ బంధంలో ఉన్నప్పుడు బాధ, సంతోషం ఏదైనాసరే దానికి కారణం ప్రేమే అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. ప్రేమ ఎప్పుడూ బాధపెట్టదు. వాస్తవానికి ప్రేమ ఎన్నడూ ఎవర్నీ బాధపెట్టదు. మనసుకైన గాయాలు మానడానికి ప్రేమ కన్నా మించిన మంచి మందు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నింటినీ పోగొట్టే శక్తి ప్రేమకు ఉంది. బాధ నుంచి బయటపడేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన ఆయుధం ప్రేమ’’ అన్నారు. -
‘అభినందన’ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ సినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు అశోక్‌కుమార్ (70) మంగళవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆరునెలలుగా హైదరాబాద్, చెన్నైలోని అనేక ఆస్పత్రులలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చివరి క్షణాలు స్వగృహంలోని కుటుంబ సభ్యుల మధ్య గడపాలన్న ఆయన కోరిక మేరకు రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చారు. మంగళవారం రాత్రి 11.30కు ఆయన కన్నుమూశారు. అశోక్‌కుమార్‌కు భార్య జ్యోతి, నలుగురు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 1944లో అలహాబాద్‌లో జన్మించిన అశోక్‌కుమార్ 1969లో జన్మభూమి అనే మలయాళ చిత్రానికి కెమెరామన్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో 125 సినిమాలకు పనిచేశారు. తెలుగులో అభినందన, నీరాజనం, సాయి మహిమలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అభినందన చిత్రానికి దర్శకునిగా నంది అవార్డును, తమిళ చిత్రం నెంజెత్తై కిళ్లాదే చిత్రానికి కెమెరామెన్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
కలెక్టర్ ఆదేశాలు కూడా పనిచేయలేదు
మాజీ సైనికులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటర్ స్లిప్పు లేదా.. టెన్షన్ వద్దు
ప్రభుత్వరంగ బ్యాంకులను కాపాడుకుందాం
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం
టీడీపీలో చేరిన నేతను నిలదీసిన గ్రామస్తులు
No Headline
మేమంతా జగనన్న బాటలోనే..
గుట్టుచప్పడు కాకుండా ‘గోకులం’ డ్రామా
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement