‘రేషన్’ పక్కదారికి చెక్ | Sakshi
Sakshi News home page

‘రేషన్’ పక్కదారికి చెక్

Published Wed, Jul 23 2014 12:27 AM

‘రేషన్’ పక్కదారికి చెక్ - Sakshi

 నల్లగొండ : ప్రజా పంపిణీ విధానంలో సరుకుల పక్కదారికి చెక్ పడనుంది. రేషన్ దుకాణంలో ఏ రోజు ఎంత విక్రయించింది, ఎవరి పేరున కొనుగోలు చేశారనే విషయంతో పాటు దుకాణంలో ఎంత నిల్వ ఉందనే వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి వరకు ఆన్‌లైన్‌లో తెలిసే విధంగా టెక్నాలజీని రూపొం దించి కసరత్తు నిర్వహిస్తున్నారు. దాం తో పీడీఎస్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా పక్కదారికి వెళ్లకుండా నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంది.అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ- పీడీఎస్ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు.
 
 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుం చి రేషన్ దుకాణం వరకు అం తా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. అందులో భా గంగానే రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు అవగాహన కల్పించడానికి గాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 10.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా వాటిలో 32,49, 226 యూనిట్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భా గంగా ఇప్పటి వరకు 90 వేల యూనిట్లు రద్దయ్యాయి. బోగస్ కార్డుల ఏరివేత పూర్తయ్యే వరకు మరో 60 వేల యూనిట్లు రద్దయ్యే అవకాశం ఉంది. కాగా మిగతా యూనిట్లకు కూ డా సక్రమంగా రేషన్ అం దుతుందా? అందడం లేదా? అనే విషయంతో పాటు అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు.
 
 పారదర్శకత కోసమే..
 జిల్లాలోని ప్రజా పంపిణీ సరుకులు పక్కదారి ప ట్టకుండా ఈ- టెక్నాలజీ చెక్ పెట్టనుంది. జిల్లాలోని పేదలకు ప్రస్తుతం 14,500 మెట్రిక్ టన్ను ల బియ్యం, 1542 కిలో లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. కాగా రేషన్ దుకాణాల నుంచే బియ్యం, కిరోసిన్ పక్కదారి పడుతున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. దాంతో వీటి పంపిణీలో పారదర్శకత ఉండేందుకు గాను ఈ -టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు.
 
 
 ఈ- టెక్నాలజీ అనుసంధానం ఇలా..
 ఈ టెక్నాలజీని రెవెన్యూ - పౌరసరఫరాల శాఖతో ప్రజా పంపిణీ విధానాన్ని అనుసంధానం చేయనున్నారు. మండల స్థాయి గోదాములు, తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధాకారి కార్యాలయం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఈ - టెక్నాలజీని అనుసంధానం చేయనున్నారు. బియ్యం, కిరోసిన్ ఇతర సరుకులు నిల్వ ఉంచే గోదాములలో కంప్యూటర్‌లు ఏర్పాటు చేసి అక్కడి ఏ రోజు ఏ డీలర్‌కు ఎంత మేరకు పంపిణీ చేశారనే విషయంతో పాటు ఎంత నిల్వ ఉంది అనే విషయాన్ని ఈ - టెక్నాలజీతో పూర్తి వివరాలు నమోదు చేస్తారు. అదే విధంగా డీలర్ కూడా దుకాణంలో ఎంత మేరకు పంపిణీ చేసింది, లబ్ధిదారుడి పేరుతో సహా పేర్కొంటారు. దాంతో పాటు డీలర్ వద్ద నిల్వ ఉన్న సరుకుల వివరాలు కూడా డీలర్ల వారిగా, లబ్ధిదారుల వారీగా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పడు తెలుస్తుంది. జిల్లాలోని 59 మండలాల తహసీల్దార్లతో 2071 డీలర్ షాపులను అనుసంధానం చేస్తారు.
 
 మీ- సేవల్లోనే రేషన్ కార్డుల జారీ?
 ఇక నుంచి మీ సేవా కేంద్రాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. అదే విధంగా అర్హులైన వారికి మీ- సేవా కేంద్రాల ద్వారానే రేషన్ కార్డులు జారీ చేస్తారు. కానీ బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగ సాగుతుండగా మీ - సేవా కేంద్రాల్లో రేషన్ కార్టుల జారీ ప్రక్రియను ప్రారంభించలేదు. కాగా బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమం అనంతరం కార్డుల జారీని మీ- సేవా కేంద్రాలకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement
Advertisement