నేటి అర్ధరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల సమ్మె | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల సమ్మె

Published Sun, May 29 2016 2:11 AM

Fuel tanker strike from midnight today

రామగుండం నుంచి ఐదు జిల్లాలకు నిలిచిపోనున్న ఇంధన సరఫరా

రామగుండం : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై 14.5 శాతం వ్యాట్ విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ అసోసియేషన్ ఆదివారం నుంచి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రామగుండం కేంద్రంగా ఉన్న హెచ్‌సీఎల్, ఐఓసీఎల్ ఇంధన డిపోల నుంచి వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలకు ఇంధన సరఫరా నిలిచిపోనుంది. ఐఓసీఎల్ డిపో నుంచి ప్రతీ రోజు వెరుు్య కిలోలీటర్లు, హెచ్‌పీసీఎల్ డిపో నుంచి మూడువందల కిలోలీటర్ల ఇంధన సరఫరా నిలిచిపోనుంది. ఐదు జిల్లాల పరిధిలోని ఆర్టీసీ, సింగరేణి, రైల్వే సంస్థలతోపాటు ఔట్‌లెట్ పెట్రోల్ బంక్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోనుండడంతో కృత్రిమ కొరత ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.

అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థలకు ఇంధన సరఫరా నిలిచిపోనుండడంతో ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై ట్యాంకర్ల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. స్థానికంగా భారత్ పెట్రోలియం కంపెనీకి చెందిన ఇంధన డిపో లేకపోయినప్పటికీ ప్రభుత్వం విధించిన వ్యాట్ బీపీసీఎల్‌కు ఉండడంతో సమ్మెలో సదరు ట్యాంకర్లు సహా మొత్తం 235 ట్యాంకర్లు పాల్గొననున్నాయి. సమ్మె ప్రభావంతో 470 మంది డ్రైవర్లు, క్లీనర్లు ఆర్థిక ఇబ్బందులకు గురికానున్నారు.

Advertisement
Advertisement