ఎంసెట్ దరఖాస్తులు లక్ష | Sakshi
Sakshi News home page

ఎంసెట్ దరఖాస్తులు లక్ష

Published Fri, Mar 27 2015 2:21 AM

EAMCET applications 1 lakh

వచ్చే నెల 9 వరకు గడువు..

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించే ఎంసెట్‌కు ఈసారి దాదాపు 20 వేలమంది ఏపీ విద్యార్థులు హాజరయ్యే అవకాశముందని ఎంసెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండటంతో ఈలోగా మరో 8 వేల మంది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తం లక్ష దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని జిల్లాల్లో 79,000 మంది దరఖాస్తు చే సుకోగా, ఆంధ్రా  వర్సిటీ పరిధిలోని వారు 6,705, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలోనివారు 5,408 మంది, ఇతర రాష్ట్రాలవారు 3,726 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు తెలిపారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో ఇంజనీరింగ్ కోసం 55,718 మంది దరఖాస్తు చేసుకోగా (బాలురు: 33,096, బాలికలు: 22,622), అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 38,041 మంది (బాలురు: 12,548, బాలికలు:25,493), రెండింటి కోసం 540 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ కోసం బాలురు, మెడిసిన్ కోసం బాలికలు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.
 
 6.
 

Advertisement
Advertisement