కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు

Published Sun, Mar 26 2017 2:48 AM

కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు - Sakshi

హైకోర్టులో 34 జడ్జి పోస్టులు ఖాళీ: ఇంద్రకరణ్‌రెడ్డి  
సాక్షి, హైదరాబాద్‌:  కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లాలో జిల్లా కోర్టు ఏర్పాటుకు హైకోర్టుతో సంప్రదిం పులు జరుపుతు న్నామని న్యాయశాఖ మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.   శనివారం శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి మాట్లా డారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంతో ఎన్నో సార్లు సంప్రదింపులు చేశామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం నగరంలో స్థలం కేటాయిస్తామని ప్రతిపాదిం చామని తెలిపారు. హైకోర్టు విభజనకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. హైకోర్టులో మొత్తం 34 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఏపీ భవన్‌ విభజనకు చర్చలు: తుమ్మల
ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనకు చర్చలు జరుపుతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. సాధారణ పరిపాలన, న్యాయశాఖల బడ్జెట్‌ పద్దులపై శాసనసభలో చర్చించడం 1996 తర్వాత ఇదే తొలిసారని వెల్లడించారు. మంత్రులు మాట్లాడిన అనంతరం స్పీకర్‌ ఎస్‌. మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు.

Advertisement
Advertisement