విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి

Published Fri, Dec 19 2014 1:24 AM

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి - Sakshi

 నకిరేకల్  :విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, నకిరేకల్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మూసపాటి కమలమ్మ(72) బుధవారం రాత్రి మృతి చెం దారు. కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్‌లో చికిత్సపొందారు. ఆస్పత్రి నుంచి ఈ నెల 8న నాంపల్లిలోని తన సోదరిడి ఇంటికి వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విష మించి మృతి చెందారు. ఆమె అంత్యక్రియ లను నాంపల్లిలోనే నిర్వహించారు.  జీవితాం తం కుమారిగానే ఉండి తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసారామె. నకిరేకల్ స్థానం నుంచి ఆరుసార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రారాఘవరెడ్డిపై పోటీ చేసి గెలుపొందిన రికార్డు ఆమెకే సొంతమైంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ  మృతి చెందడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
 
 హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కమలమ్మ అనేక ఉద్యమాల్లో పనిచేశారు. రాజకీయాల్లోకి చేరిన తర్వాత నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. మెదక్‌జిల్లా జిన్నారం మండలం దాసారం గ్రామానికి  చెందిన శాంతమ్మ, నాగయ్యలకు 1943లో మూసపాటి కమలమ్మ జన్మించింది. ఈమెకు నలుగురు అన్నదమ్ములున్నారు. ఆనాడు తండ్రి ద్వారా గాంధీ, నెహ్రూలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల గాధులు విన్న ఆమె, వారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు.
 
 కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలిగా..
 బీఏ వరకు చదివిన మూసపాటి కమలమ్మ 1959లో నల్లగొండ జిల్లా పరిషత్, పంచాయతీ సమితీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లాలో గ్రామ గ్రామాన ఎడ్ల బండ్లపై తిరిగి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు.. ఆనాటి జిల్లా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే జిల్లా రాజకీయాల్లో స్థిరపడ్డారు. 1967 ఎన్నికలోఉ్ల నకిరేకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాఘవరెడ్డిపై ఓడిపోయారు. తిరిగి 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ప్రాతినిథ్యం వహించిన నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. 1970లో సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ సోషల్ వర్కర్స్ మహాసభల్లో ఫిలిప్పిన్స్, జపాన్, బ్యాంకాక్, హాంకాంగ్‌లో ఇందిరాగాంధీతో కలిసి పాల్గొన్నారు.  
 
 ప్రజా ప్రతినిధిగా..
 ఎమ్మెల్యేగా ఎన్నికైనా తరవాత కమలమ్మ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యేగా నకిరేకల్, కట్టంగూర్, శాలిగౌరారం, తోపుచర్ల, ఫిర్కాలలో బలహీన వర్గాల రైతుల కోసం బావులు తవ్వించారు. 1972 సెప్టెంబర్ 7న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీని  నకిరేకల్‌కు పిలిపించి నియోజక వర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. నకిరేకల్‌లో కోఆపరేటివ్ బ్యాంక్, బస్టాండ్ నిర్మాణం, చేనేత కార్మికులకు రుణాలు, గుడివాడలో వడ్డెర కార్మికులకు 25 బోరు బావులు వేయించారు.
 
 నిర్వహించిన పదవులు..
 1959లో సేవాదళ్ కార్యకర్తగా, 1962లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా, 1972లో నకిరేకల్ ఎమ్మెల్యేగా, ఆల్‌ఇం డియా పల్స్ బోర్డ్ డెరైక్టర్‌గా, 1978, 79లో మైనింగ్ కార్పోరేషన్ డెరైక్టర్‌గా, బీసీ కార్పోరేషన్ ైడె రెక్టర్‌గా, రెండు సార్లు సెం ట్రల్ వెల్ఫేర్ బోర్డ్ డెరైక్టర్‌గా పని చేశారు. పీసీసీ సభ్యురాలిగా కొనసాగారు.
 

Advertisement
Advertisement