అన్నీ మాటలే.. చేతలేవి? | Sakshi
Sakshi News home page

అన్నీ మాటలే.. చేతలేవి?

Published Fri, Jul 3 2015 4:11 AM

అన్నీ మాటలే.. చేతలేవి? - Sakshi

మరో పుష్కరానికైనా ఏర్పాట్లు పూర్తయ్యేనా?
పుష్కర పనుల నత్తనడకపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు

 
 బాల్కొండ : పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడపదాటడం లేదని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆరోపించారు.  పనులు మాత్రం పుష్కర కాలం  వరకు కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదన్నారు. గురువారం ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరాల కు మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రభుత్వం కుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహిస్తామని ప్రకటించిందని, కానీ ఆ తరహాలో ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, అరుునా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

 ఏపీలో పుష్కరాలకు అక్కడి ప్రభుత్వం రూ. 1,600 కోట్లు కేటారుుస్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ. 510 కోట్లు కేటారుుంచి చేతులు దులుపుకుందని పల్లె గంగారెడ్డి విమర్శించారు. తక్కువ నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు మాత్రమే  ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు.  తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న పుష్కరాల పనులపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఢమాంకర్ శ్రీనివాస్, నియోజక వర్గ ఇన్‌చార్జి రుయ్యాడి రాజేశ్వర్, ముప్కాల్ ఎంపీటీసీ సభ్యులు చిలుక గోపాల్, గంగాధర్, నాయకులు రాజేశ్వర్, లక్ష్మణ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement