35 మంది విద్యార్థుల సస్సెన్షన్ | Sakshi
Sakshi News home page

35 మంది విద్యార్థుల సస్సెన్షన్

Published Sun, Feb 1 2015 8:17 PM

35 students suspended

ఖమ్మం: పాలేరు నవోదయ విద్యాలయంలో తెలుగు-బీహార్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కోసం ఏటా ఇక్కడి విద్యార్థులను కొంతమందిని బీహార్‌కు, అక్కడి వారిని ఇక్కడికి బదిలీ చేస్తుంటారు. ఇలా గత ఏడాది తొమ్మిదో తరగతి విద్యార్ధులు 16 మందిని బీహార్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం వారికి, స్థానిక విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బీహార్ విద్యార్థులు ఇక్కడినుంచి వెళ్లిపోతామంటూ తరగతి గదుల నుంచి బయటకు రాగానే ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు వారిని తిరిగి తన గదికి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా స్ధానిక నవోదయ విద్యాలయానికి చెందిన 35 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఆదివారం ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి పిల్లలను తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు.
(కూసుమంచి)

Advertisement
Advertisement