చదువులమ్మ చల్లని ఒడి...


సాక్షి విద్య 

సాక్షి భవిత  

సాక్షి చుక్కాని  

సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్

సాక్షి పబ్లికేషన్స్   

సాక్షి సెమినార్స్    

సాక్షి ఆన్‌లైన్ టెస్ట్స్

నిపుణులు అందించే నాణ్యమైన పోటీ పరీక్షల కంటెంట్

నూటికి నూరు శాతం క చ్చితత్వంతో కూడిన ‘కీ’

పోటీ పరీక్షల మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్స్

ఆల్ జాబ్స్, అడ్మిషన్స్, స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ నోటిఫికేషన్స్

కెరీర్ గెడైన్స్ ఆర్టికల్స్

అకడెమిక్, పోటీ పరీక్షల ప్రిపరేషన్ గెడైన్స్

టెన్త్‌క్లాస్ స్పెషల్స్

జనరల్ ఎస్సేస్, కరెంట్ అఫైర్స్

కెరీర్ కౌన్సెలింగ్, సక్సెస్ స్టోరీస్

నేషనల్ పర్స్‌పెక్టివ్స్‌తో టాప్ స్టోరీలు

నేషనల్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనిస్ట్‌లు,
ప్రొఫెసర్లు, సైంటిస్ట్‌ల గెస్ట్‌కాలమ్స్

మై క్యాంపస్ లైఫ్

ఎడ్యుపాలసీ, ఎడ్యున్యూస్




విద్వాన్ సర్వత్ర పూజ్యతే..! విద్యా దీపం ఆవశ్యకతను ముందే గుర్తించిన ‘‘సాక్షి’’... తన ఈ ఏడేళ్ల ప్రస్థానంలో అడుగడుగునా యువత ఆకాంక్షలకు అద్దం పట్టింది. ఉజ్వల ‘భవిత’ను కోరే ‘విద్యా’ర్థులకు కోర్సు ఎంపికలో, ఉద్యోగ సాధనలో, కెరీర్ గమనంలో ‘చుక్కాని’లా నిలిచింది. సాక్షి తొలి రోజు నుంచే ప్రారంభించిన భవిత, విద్య.. విద్యార్థులు, నిరుద్యోగుల మన్ననలు పొందాయి. ప్రతి ఒక్కరికీ విద్య, భవిత, చుక్కాని, సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్, సాక్షి స్కూల్, పబ్లికేషన్స్ ద్వారా  మేలు చేయాలన్నదే  సాక్షి ఆశయం! ఎడ్యుకేషన్ పేజీలను విద్యార్థులకే పరిమితం చేయకుండా.. ఇంటిల్లిపాదీ చదివేలా చూడాలన్నదే సాక్షి సంకల్పం!!  

 - ధనుంజయరెడ్డి

 ఎడ్యుకేషన్ ఎడిటర్


 

 భవిత : స్పర్థయా వర్థతే విద్య

 పరీక్ష ఏదైనా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ డిటెయిల్స్, ఎగ్జామ్స్ ప్యాటర్న్, ప్రిపరేషన్ గెడైన్స్, నిపుణులు, టాపర్‌ల సక్సెస్ టిప్స్‌తోపాటు ప్రామాణిక సమాచారం అందిస్తోంది భవిత. పదో తరగతి పరీక్షలప్పుడు భవితలో ఆరు వారాల పాటు అందిస్తున్న టెన్త్ క్లాస్ స్పెషల్ గ్రామీణ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకోవడం తెలిసిందే. టెట్, డీఎస్సీ, సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 మోడల్ పేపర్స్.. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, అగ్రికల్చర్... కోర్సు, కెరీర్ ఎంపికలో మెళకువలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇన్ఫో, హయ్యర్ ఎడ్యుకేషన్ సమాచారం.. ఫారిన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్.. నిపుణుల అమూల్య సలహాలతో గెస్ట్‌కాలం.. విజేతల అనుభవాల సారం.. సక్సెస్ స్పీక్స్.. కరెంట్ అఫైర్స్, కెరీర్ కౌన్సెలింగ్.. ఇలా ఎంతగానో ఉపయోగపడే కాన్సెప్ట్‌లతో యువతను ఆకట్టుకుంటోంది!!

 

 విద్య: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

 అకడమిక్ పరీక్షల నుంచి డీఎస్సీ, బ్యాంక్స్, గ్రూప్స్, సివిల్స్ తదితర అత్యుత్తమ ఉద్యోగ పరీక్షల వరకూ తెలుగు విద్యార్థులంతా ఎదురు చూసేది సాక్షి విద్య పేజీల్లో అందించే నాణ్యమైన కంటెంట్ గురించే అనడం అతిశయోక్తికాదు. సాక్షి పేపర్ కొనుక్కొని విద్య పేజీలను కట్ చేసి, ఫైల్ చేసుకొని  తమ ప్రిపరేషన్‌లో భాగంగా ఫాలో అయ్యేవారెందరో..! నాలుగు రోజులు పోటీ పరీక్షల కంటెంట్ ఇవ్వకుంటే.. వందలాది ఫోన్‌లు, ఈమెయిల్స్..! కంటెంట్ ఎందుకివ్వడం లేదని! విద్యలో ఇస్తున్న సమాచారంపై విద్యార్థుల విశ్వసనీయత అలాంటిది. అకడెమిక్, పోటీ పరీక్షల కంటెంట్‌తోపాటు  జాబ్స్, అడ్మిషన్స్, స్కాలర్ షిప్స్, ఫెలోషిప్స్, ఎడ్యు న్యూస్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం విద్య పేజీల ద్వారా అందిస్తున్నాం. గ్రూప్-1, గ్రూప్-2 , డీఎస్సీ, ఎంసెట్.. ఏ  పరీక్ష జరిగినా, తెల్లారే నూటికి నూరు శాతం కచ్చితత్వంతో కీ ప్రచురించడం ప్రారంభించింది సాక్షే!  

 

 చదువుల నావ ను ఒడ్డుకు చేర్చే చుక్కాని


 వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, వాటిని సాధించే మార్గాలు, పోటీ పరీక్షలకు గెడైన్స్, నిపుణుల  విశ్లేషణలు, సమయోచిత సూచనలతో ‘టాప్ స్టోరీ’. మనలో నిగూఢంగా దాగివున్న నైపుణ్యం, ఆసక్తిని వెలికితీసి మెరుగులు దిద్దుకునేందుకు ఉపయోగపడే ‘ప్రేరణ’.  ప్రొఫెసర్లు, డీన్‌లు, సైంటిస్ట్‌లు తమ తమ రంగాల్లో గడించిన అనుభవంతో మార ్గనిర్దేశం చేసేలా ప్రతివారం గెస్ట్‌కాలమ్. ఉద్యోగ నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటూ దూసుకెళ్లడానికి ఉపయోగపడే ‘జాబ్ స్కిల్స్’. మరుపురాని క్యాంపస్ లైఫ్ విశేషాలతో మై క్యాంపస్ లైఫ్.. వెరసి మీరు చదువుకుంటున్నా, ఉద్యోగ జీవితంలో అడుగు పెడుతున్నా... మీ జీవిత నావకు ఇది ‘చుక్కాని’!

 

 సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్

 2009లో ప్రారంభమైన సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్.. అనతికాలంలోనే బెస్ట్ ఎడ్యుకేషనల్ వెబ్ పోర్టల్‌గా మన్ననలు అందుకుంటూ, అలెక్సియా ర్యాంకింగ్‌లో టాప్ 500లో నిలిచింది. ఏళ్ల క్రితమే ఏర్పాటైన ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్‌లను దాటుకొని ఈ ఘనత సాధించింది. ఇండియాలో, విదేశాల్లో.. ఎక్కడైనా, ఏ కోర్సుకైనా, ఎలాంటి ఎగ్జామైనా, ఏ జాబ్ కోసమైనా..  ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ ప్రిపరేటరీ మెటీరియల్, ఎక్స్‌పర్ట్స్ గెడైన్స్‌కు తిరుగులేని మార్గం-సాక్షి ఎడ్యుకేషన్ డాట్‌కామ్.  జాబ్స్, అడ్మిషన్లు, ప్రీవియస్ పేపర్‌‌స, జాబ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన సమాచారం, మెటీరియల్.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన బెస్ట్ కంటెంట్, గెడైన్స్ అత్యంత వేగంగా అప్‌డేట్ అయ్యేది ఇందులోనే! కాలేజీలు, కోర్సులు, నోటిఫికేషన్స్, స్కాలర్‌షిప్స్, రిజల్ట్స్, ఫెలోషిప్‌లు, కంటెంట్, కరెంట్ అఫైర్స్... ఎలాంటి విశ్వసనీయ సమాచారం కోసమైనా విద్యార్థులు మొట్టమొదట బ్రౌజ్ చేసేది సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్‌నే..!  

 

 అనుభూతులు అనేకానేకం

సంగీతం, సాహిత్యం, సినిమా, ఆధ్యాత్మికం - ఏ రంగం తీసుకున్నా అందులోని వారంతా ఏడేళ్ళుగా ‘సాక్షి’కి ‘ఫ్యామిలీ’ మెంబర్లే! వార్తల్లోని వ్యక్తులపైనే కాక వార్తలకు అవతలే మిగిలినవారి‘అదర్‌సైడ్’ను ఆవిష్కరించి... అటు వారినీ, ఇటు పాఠకులనూ ‘రీచార్జ్’ చేయడం ‘సాక్షి’కే సాధ్యమైన ‘డబుల్ ధమాకా’!   ‘సాక్షి’తో కలసి నడుస్తున్న క్రమంలో ఎన్నో జ్ఞాపకాలు... వైయక్తికంగానూ, వ్యవస్థాగతంగానూ రసభరితమే. సంప్రదాయ సంగీత దిగ్గజం మంగ ళంపల్లితో ఒక సాయంత్రం... ‘జ్ఞానపీఠి’కా పురాధిష్ఠితులైన సి.నారాయణరెడ్డితో ఒక ఉదయం... ఆధ్యాత్మిక రంగంలో సేవలందిస్తున్న స్వామి సుఖబోధానంద, ‘రామకృష్ణ మఠం’ స్వామి జ్ఞానదానందలతో గడిపిన గంటలు... ఆధునికాంధ్ర వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు శతమానోత్సవ శుభవేళ పేజీలకందని ప్రత్యేక అనుబంధం... కుంచె కన్నీరు పెట్టిన బాపు వియోగ వేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల కన్నీటిలో తడిసిముద్దయిన ఆ అకాల తుపాను రాత్రి... అందాల ఆడబొమ్మగానే ప్రపంచం చూసే షకీలా అంతరంగంలో పేలుతున్న అగ్నిపర్వతపు లావాలో స్థాణువైపోయిన ఆ సాయంసంధ్య... ఒకటా, రెండా! పేజీలలో పొదిగిన అక్షరాల వెనుక ఒదిగిన అనుభవాలు, అనుభూతులు అనేకానేకం!!

 - డాక్టర్ రెంటాల జయదేవ

 సీనియర్ న్యూస్ ఎడిటర్


 

 సాంకేతికం... సరళం


 సైన్స్, టెక్నాలజీ... రెండూ చాలామంది సామాన్యులకు కొరకరాని కొయ్యలే. కానీ మనిషి మేధో ప్రగతికి ఇవే కీలకం. అందుకే సాక్షిలో మొదటి నుంచి ఈ రెండు అంశాలను అందరికీ అర్థమయ్యే రీతిలో  సరళశైలిలో రాసేందుకు ప్రయత్నిస్తూవచ్చాం. ఇందులో కొంతమేరకు విజయం సాధించామనే చెప్పాలి. విశ్వ రహస్యాలను ఛేదించగల లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగాల సందర్భంగా, రైతు భవిష్యత్తును నిర్ణయించే వార్షిక రుతుపవనాల రాక, పురోగతుల నేపథ్యంలోనూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, విశ్లేషణలను అందించగలిగాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల కీలకాంశాలను వివరించ గలిగాం. లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగాల సందర్భంగా రాసిన జనరల్ ఫీచర్ ‘‘మహా ప్రయోగం ముందూ వెనుక’’ను చదివి చాలా బాగా రాశారని ఆ ప్రయోగంలో సభ్యుడైన శాస్త్రవేత్త అభినందించడం, హైదరాబాద్ వేదికగా జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు ‘కాప్-11’ కవరేజీ... వృత్తిపరమైన సంతృప్తిని కలిగించిన కొన్ని అంశాలు.

 - గిళియార్ గోపాలకృష్ణమయ్యా

 అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top