స్తంభించిన సినీ పరిశ్రమ! | Sakshi
Sakshi News home page

స్తంభించిన సినీ పరిశ్రమ!

Published Tue, Sep 30 2014 1:27 PM

tamilnadu movie industry stands with jayalalithaa

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా సినీపరిశ్రమ స్తంభించింది. తమిళనాడులో మంగళవారం ఎక్కడా ఒక్క సినిమా కూడా ఆడలేదు. థియేటర్లన్నీ మూతపడ్డాయి. దాంతోపాటు తమిళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులంతా మంగళవారం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. తమిళ సినీ నిర్మాత లమండలి, దక్షిణ భారత కళాకారుల సంఘం కూడా ఈ నిరాహార దీక్షకు తమ సంఘీభావం తెలిపాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చెపాక్ ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

జయలలిత అరెస్టుతో తమిళనాడులో అనేకమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. మరికొంతమందికి గుండెపోట్లు వచ్చాయి. మొత్తం 16 మంది మరణించారు. కోర్టు తీర్పు గురించి తాము ఏమీ వ్యాఖ్యానించలేమని, అయితే జయలలితకు మాత్రం సంఘీభావంగా ఉంటామని సినీ పరిశ్రమ చెబుతోంది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయ.. తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement