సెల్ఫీ కోసం ఎయిర్హోస్టెస్ చేయిపట్టిలాగి.. | Sakshi
Sakshi News home page

సెల్ఫీ కోసం ఎయిర్హోస్టెస్ చేయిపట్టిలాగి..

Published Tue, Jun 28 2016 8:37 AM

సెల్ఫీ కోసం ఎయిర్హోస్టెస్ చేయిపట్టిలాగి..

ముంబయి: ఎయిర్ హోస్టెస్తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి గుజారత్ కు చెందిన ప్రయాణికుడు చిక్కుల్లో పడ్డాడు. ఎయిర్ హోస్టెస్ కు ఇష్టం లేకుండా బలవంతంగా స్వీయచిత్రాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు విమానం టాయిలెట్లో పొగతాగడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహ్మద్ అబుబాకర్(29) అనే వ్యక్తి డామమ్ నుంచి ముంబయికి  విమానంలో బయలుదేరాడు. విమానం డామమ్ నుంచి బయలుదేరగానే తన అసభ్య ప్రవర్తన ప్రారంభించాడు. ఎయిర్ హోస్టెస్ విమానంలో నడుస్తుండగా ఆమె వెనుకాలే చప్పుడు చేయకుండా వెళ్లాడు.

తన వెనుకాలే ఏదో వస్తుందని అనుమానం వచ్చి వెనుకకు తిరగి చూడగా వెంటనే అతడు’ చలో యార్ ఒక సెల్ఫీ తీసుకుందాం’ అని చేయిపట్టి లాగాడు. ఆమె అందుకు నిరాకరించినా వినకుండా బలవంతపెట్టాడు. అంతటితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెళ్లి తన సీట్లో కూర్చోగా వెనుకాలే నిల్చుని ఇబ్బంది పెట్టాడు. తన భుజాలపై చేయివేసి సెల్ఫీకోసం బలవంతపెట్టాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో విమాన సిబ్బంది నలుగురు అక్కడికి వచ్చారు. అది గమనించిన బాకర్ విమాన టాయిలెట్ లోకి వెళ్లి తాపీగా సిగరెట్ తాగి వచ్చాడు.

దీంతో ఫ్లైట్ సిబ్బంది అతడి వద్ద నుంచి సిగరెట్ ప్యాక్, లైటర్ లాగేసుకున్నారు. అతడి ఫోన్ కూడా తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి రాగానే అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యక్తి సౌదీ అరేబియాలోని డామమ్ లో ఓ రెస్టారెంటులో పనిచేస్తున్నట్లు తెలిసింది. తనిఖీలు చేసినా అతడి వద్దకు సిగరెట్, లైటర్ ఎలా వచ్చిందనే అంశంపైనా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. ఈ విమానం జెట్ ఎయిర్ వేస్ సంస్థది.

Advertisement
Advertisement