ఉత్సాహంగా ‘ఎస్‌జీఎఫ్‌’ ఎంపికలు | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘ఎస్‌జీఎఫ్‌’ ఎంపికలు

Published Tue, Sep 27 2016 12:13 AM

02.బాస్కెట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్టేడియంలో సోమవారం అండర్‌–14, అండర్‌–17 బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని తుది జిల్లాజట్లకు ఎంపిక చేశారు. అంతకుముందు ఉదయం పోటీలను డీఎస్‌డీఓ టీవీఎల్‌ సత్యవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాన్ని వెలికి తీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో రాణించాలని కోరారు. జిల్లాజట్లకు ఎంపిక కాని వారు నిరాశచెందకుండా మళ్లీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని సూచించారు. అండర్‌–14, అండర్‌–17 యోగా జిల్లా క్రీడాకారుల ఎంపికలను స్థానిక సాయికృష్ణ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. 
ూ అండర్‌–14 హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టు: జాన్‌పాల్, ప్రజ్ఞాన్, శంకర్, చరణ్, భరత్, దేవుజ, ప్రణయ్, వంశీమోహన్, రాజేశ్‌కుమార్, శ్రీను, మహేశ్, ఆసిఫ్‌ అబ్దుల్, గోపాల్, అభినవ్‌సాయి, రాజేశ్, రాహుల్‌. బాలికల జట్టు: మహేశ్వరి, బింధు, రాధిక, సింధూజ, కె.శిరీష, గిరిజ, శ్రీవల్లి, మానస, శిరీష, అమృత, జ్యోతి, శ్రావణి, కవిత, సునీత, అర్షియ.
ూ అండర్‌–17 హ్యాండ్‌బాల్‌ బాలుర జట్టు: ప్రణయ్‌కుమార్, శ్రీకాంత్, కల్యాణ్, అభినవ్‌కుమార్, ఆసిఫ్‌బేగ్, రాజేందర్, గణేష్, గోపాల్, చంద్రకాంత్, జె.శ్రీకాంత్, సతీష్‌కుమార్, రోహిత్, సునీల్, అబ్దుల్‌ ఆదిల్, నరేశ్, గోపికృష్ణ. 
 బాలికల జట్టు: ప్రీతి, శ్వేత, శిరీష, సంధ్య, జి.శిరీష, జ్యోత్సS్న, దివ్య, అఖిలారెడ్డి, సాయిసుధాగౌడ్, ప్రవళిక, స్వాతి, సంధ్య.
ూ అండర్‌–17 బాస్కెట్‌బాల్‌ బాలుర జట్టు: శివశంకర్, సాయికుమార్, అఫ్రోజ్‌అలీ, రాఘవేంద్ర, ఆదిశేషు, సందీప్‌కుమార్, సాయిదీపక్, నితీష్‌రెడ్డి, చైతన్య, మాసుం, ఉపేంద్ర, రఘు. బాలికల జట్టు: రిశితారెడ్డి, జ్యోతి, అర్చిత, స్వర్ణలత, సంధ్య, శరణ్‌శెర్లి, నిఖిత, ఐశ్వర్య, స్నేహ, క్రిష్ణవేణి, సౌజన్య, మౌనిక. 
ూ అండర్‌–14 బాలుర జట్టు: రోహిత్‌కుమార్, వెంకటేశ్, శివకుమార్, విశాల్, అల్తాఫ్, అజహర్, నవీన్‌కుమార్, సుకుమార్‌రెడ్డి, అబ్దుల్‌ బాసిత్, సిద్ధార్థానాయక్, దర్వేష్, నర్సింహ రెడ్డి. బాలికల జట్టు:  జశ్వాని, భువనేశ్వరి, సుషమ్న, మహేశ్వరి, పావని, హరినిరెడ్డి, శమంత, అనూష, స్వప్న, వైష్ణవి, బి.స్వప్న, సాత్విక. 
 
 

Advertisement
Advertisement