చీటింగ్‌ కేసులో నిందితులకు జైలు | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో నిందితులకు జైలు

Published Thu, Sep 29 2016 12:34 AM

jail for cheater

కర్నూలు(లీగల్‌): ఫోర్జరీ దస్త్రాలను సృష్టించిన ఇద్దరు నిందితులకు ఏడాది కఠిన కారాగారశిక్ష, ఒక్కొక్కరికి రూ.15 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు స్పెషల్‌ ఎకై ్సజ్‌ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. బాధితుడు జి.సుందర్‌రాజన్‌ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు.. 1984లో ఇతని తండ్రి స్థానిక లేపాక్షి నగర్‌లో ఒక ఇంటిస్థలాన్ని కొనుగోలు చేశారు. ఆయన తన కుటుంబాన్ని హైదరబాద్‌కు మార్చి 2004లో అక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత సుందరరాజన్‌ తన తండ్రి ఇంటి ప్లాటును గమనించాల్సిందిగా మామిదాలపాడు గ్రామానికి చెందిన రాఘవరెడ్డికి చెప్పి అందుకు సంబంధించిన జిరాక్స్‌ కాపీలను ఇచ్చారు. అయితే ఇవి వెల్దుర్తి మండలం గుంటుపల్లికి చెందిన నిందితుడు రమణారెడ్డి వద్దకు చేరడంతో ఆయన.. ఫోర్జరీ పత్రాలను సృష్టించి తన పేరు మీద జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేరుకున్నారు. ఈ స్థలాన్ని   కర్నూలుకు చెందిన కె.భాస్కర్‌కు విక్రయించాడు. దీంతో బాధితుడు విషయం తెలుసుకుని నిందితులు కె.భాస్కర్, రమణారెడ్డి, రాఘవరెడ్డిలపై ఫిర్యాదు చేశారు. కోర్టులో కె.భాస్కర్, రమణారెడ్డిలపై మాత్రమే నేరం రుజువు కావడంతో వారికి ఒక ఏడాది కారాగారశిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. మరో నిందితుడు రాఘవరెడ్డిపై నేరం రుజువు కాకపోవడంతో అతనిపై కేసును కోర్టు కొట్టివేసింది.
 

Advertisement
Advertisement