పట్టిసీమ వల్ల పోలవరానికి ప్రమాదం: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

పట్టిసీమ వల్ల పోలవరానికి ప్రమాదం: వైఎస్ జగన్

Published Tue, Mar 31 2015 3:53 PM

ఏపీ సమస్యలు అరుణ్ జైట్లీకి వివరిస్తున్న వైఎస్ జగన్, ఎంపీలు సుబ్బారెడ్డి, మేకపాటి - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో  వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించిన అంశాలను అరుణ్జైట్లీకి వివరించినట్లు చెప్పారు. పట్టిసీమ వల్ల పోలవరం కోల్డ్స్టోరేజీకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పినట్లు తెలిపారు. పట్టిసీమలో ఎక్సెస్ టెండర్లు వేసిన అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తమ ఆందోళనను మంత్రి ముందు ఉంచినట్లు చెప్పారు. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేవలం డబ్బు కోసం ఈ టెండర్లు పిలిచినట్లు తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు, రాజధాని నిర్మాణంపై చర్చించినట్లు వివరించారు. తాను చెప్పిన సమస్యలు అరుణ్ జైట్లీ సానుకూలంగా విన్నారన్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు తెలిపారు. ప్రతి వేదిక వద్ద పట్టిసీమ అంశంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరుతున్నట్లు తెలిపారు. ఏపీ వాహనాలపై పన్నును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ని కోరతామని చెప్పారు.  రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని వైఎస్ జగన్ అన్నారు.

Advertisement
Advertisement