పిచ్చుకపై బ్రహ్మాస్త్రం | Sakshi
Sakshi News home page

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

Published Sun, Oct 26 2014 12:56 AM

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం - Sakshi

ఎటు చూసినా పోలీసులే.. మొత్తం ఐదొందల మంది.. అందరి చేతుల్లో లాఠీలు.. దాడుల్ని ఎదుర్కొ నే కవచాలు.. అలాగని అక్కడేమీ యుద్ధ వాతావరణం లేదు.. ఎలాంటి విపత్తు రాలేదు.. పోనీ డ్రిల్ ప్రాక్టీస్ కోసం వచ్చారా అంటే అదీ కాదు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలనుకున్నారో ఏమో గానీ.. కొవ్వూరు మండలం వాడపల్లిలోని గోంగూరతిప్ప ఇసుక ర్యాం పులో పోలీసులు బిలబిలమంటూ దిగారు. వారిలో ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 10మంది ఎస్సైలు, 300 మందికి పైగా కానిస్టేబుళ్లు, రెండు ప్లటూన్ల సాయు ధులు ఉన్నారు. ర్యాంపులో అక్రమాలను అరికట్టాలని, తమకు న్యాయం చేయూలని కోరుతూ ధర్నా చేసిన అక్కడి ప్రజలు, డ్వాక్రా మహిళలతో చర్చించేందుకు అధికారులు రాగా, పోలీసు బలగాలను మోహరిం చారు. ర్యాంపు విషయమై ఎవరైనా ఆందోళనలు చేప డితే అణచివేస్తామని సంకేతమిచ్చేందుకే బలగాలను దింపినట్టు పోలీసు వర్గాల భోగట్టా. పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటే ఇదేనేమో.         

Advertisement
Advertisement