ముద్రగడను చూస్తే చంద్రబాబుకు గడబిడ | Sakshi
Sakshi News home page

ముద్రగడను చూస్తే చంద్రబాబుకు గడబిడ

Published Sun, Feb 7 2016 6:01 PM

kapu reservation movement

 ఒంగోలు సబర్బన్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గడబిడ మొదలవుతుందని కాపు సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఒంగోలులో శనివారం కాపు సంఘాల ఆధ వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక రాజపానగల్ రోడ్డులో జయరాం సెంటర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రిలే దీక్షలు ప్రారంభించారు. జిల్లా కాపు సంఘ అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో నాయకులు గొర్రెపాటి అర్జున్‌రావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళన చేస్తే ఎందుకంత ఆక్రోశమని ధ్వజమెత్తారు.

ముద్రగడ ఆమరణ దీక్షకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. బీసీల్లో చేర్చే వరకు ఆందోళనలు ఆపేది లేదని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జీవో 30ని వెంటనే అమలు చేయూలని డిమాండ్ చేశారు. ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో కాపులకు హామీలు ఇవ్వటం, అనంతరం విస్మరించటం  ఓపికతో భరిస్తూ వస్తున్నారని, ఇక అంత ఓపిక లేదని అన్నారు. బీసీ ఉద్యమ నేతగా ఎదిగిన ఆర్.కృష్ణయ్య టీడీపీ తరఫున తెలంగాణాలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఏం పని అని ప్రశ్నించారు. ఏమైనా ఉంటే తెలంగాణాలో రాజకీయాలు చేసుకోవాలన్నారు. చంద్రబాబు ద్వంద్వ విధానాన్ని, నాన్చుడు ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. దీక్షలో కొక్కిరాల సంజీవ్‌కుమార్, గొర్రెపాటి అర్జునరావు, వై.వెంకటేశ్వరరావు, తాటిపర్తి వెంకటరంగారావు, చెంగలశెట్టి కుసుమకుమారి, పసుపులేటి గోవిందరావు, నాగిశిట్టి బ్రహ్మయ్య, బేతంశెట్టి హరిబాబు, గాదిరెడ్డి కిషోర్, వెలనాటి మాధవరావు, దండే రామారావు, వేలం వె ంకటేశ్వరరావు, ఆరిగ మల్లిఖార్జునరావు పాల్గొన్నారు.

దీక్షకు మద్దతు తెలిపిన వారిలో గాదె వెంకటకృష్ణ, ఆరిగ చలమయ్య, కుర్రా ప్రసాదబాబు, దండే వెంకటకృష్ణారావు, తోట సోమశేఖర్, గంటా రమణయ్య, గంటా రాము, వెలనాటి హరిబాబు, పాలెం సురేష్‌బాబు, ఆరిగ శంకర్, ఉమ్మడిశెట్టిశ్రీనివాసరావు, ఆరిగ వీర ప్రతాప్, చెంగలశెట్టి శ్రీనివాసరావు, చాకిరి ధనుంజయ, ఆరిగ శివ, పోదుల మల్లిఖార్జునరావు, వరదా నాగేశ్వరరావు, పోకల సత్యం, కావలి శ్రీనివాసులు, చొప్పవరపు శ్రీనివాస్(ఓఎంసి), పసుపులేటి కొండయ్య, చిక్కాల రామారావు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement